Egg Kurma: ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా.. తయారీ విధానం?
మామూలుగా మనం కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. కోడి గుడ్డు కర్రీ, కోడిగుడ్డు మసాలా కర్రీ, ఎగ్ దమ్ బిర్యాని, ఎగ
- By Nakshatra Published Date - 08:15 PM, Sun - 3 September 23
మామూలుగా మనం కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. కోడి గుడ్డు కర్రీ, కోడిగుడ్డు మసాలా కర్రీ, ఎగ్ దమ్ బిర్యాని, ఎగ్ బిర్యానీ, ఎగ్ రైస్ ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా ఎగ్ కుర్మా తిన్నారా. ఒకవేళ ఎగ్ కుర్మాని తినకపోతే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎగ్ కుర్మాకి కావలసినవి:
కోడిగుడ్లు – 4
ఉల్లిపాయలు – 2
టొమాటో – 2
ధనియాలపొడి – టీ స్పూన్
ఉప్పు – సరిపడా
కరివేపాకు – రెండు రెబ్బలు
అల్లం, వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్
కారం – టీ స్పూన్
పసుపు – పావు టీ స్పూన్
గసగసాలు – టీ స్పూన్
దాల్చినచెక్క – 1
లవంగాలు – 3
ఏలకులు – 2
జీడిపప్పు – 10
పుదీనా – కొన్ని ఆకులు
నూనె – సరిపడగా
కొత్తిమీర – గార్నిష్‌కి
సోంపు – అర టీ స్పూన్
ఎగ్ కుర్మా తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి రంగు వచ్చేవరకు వేయించి, అల్లం, వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి , టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దను కూడా వేసి కలుపుతూ 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత కోడిగుడ్లు వేసి అయిదు నిమిషాలు వుంచాకా సరిపడా నీళ్ళు వేసి మూతపెట్టాలి. గ్రేవీ కొంచం చిక్కగా అయ్యాక స్టవ్ మీదనుంచి దించేసి కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా రెడీ.
Related News
Egg Kaaram: కోడిగుడ్డు కారం ఇలా చేస్తే చాలు ప్లేటు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?
మామూలుగా మనం కోడిగుడ్డుతో అనేక రకాల వంటలు చేసుకొని తింటూ ఉంటాం. ఇంట్లో రెండు మూడు రకాల వెరైటీస్ మాత్రమే చేసుకొని తింటే రెస్టారెంట్లో ఎన్నో రకాల రెసిపీస్ ఉంటాయి. అటువంటి వాటిలో కోడిగుడ్డు కారం కూడా ఒకటి. కొంతమంది ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకుంటే మరి కొంతమంది హోటల్ రెస్టారెంట్ లో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ రెసిపీ ని ఇలా చేయాలి అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈ �