Eyelashes Growth Tips: కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
ముఖంలో మన కళ్ళపై ఉండే కనురెప్పలు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కనురెప్పలు లేకపోతే ముఖం అందవిహీనంగా కని
- By Anshu Published Date - 09:20 PM, Thu - 15 February 24
ముఖంలో మన కళ్ళపై ఉండే కనురెప్పలు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కనురెప్పలు లేకపోతే ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఈ కనురెప్పలు సరిగా లేక కనురెప్పల కోసం బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగడంతో పాటు వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది డబ్బు పెట్టడానికి స్తోమత లేక ఏం చేయాలో అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ సింపుల్ రెమెడీస్. ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే దట్టమైన ఒత్తుగా ఉండే కనురెప్పలను మీ సొంతం చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ మన కనురెప్పలను క్లీన్ గా ఉంచాలి.
మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ రిమూవర్ తో మీ ఐ మేకప్ ను క్లీన్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే కాటన్ బాల్ మేకప్ క్లీనర్‌లో పెట్టి దాంతో కంటిని గుండ్రంగా మెల్లిగా క్లీన్ చేయాలి. కనురెప్పల్ని తేమగా ఉంచాలి. మేకప్, ధూళిని పోగొట్టే క్లెన్సర్‌ని వాడాలి. మేకప్, ధూళి కనురెప్పల్ని డ్రైగా చేసి ఐ ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది. దీంతో కనురెప్పలు రాలిపోతాయి. ప్రతి రోజు ముఖాన్ని కడిగినప్పుడు కనురెప్పల వెంట్రుకలు నీట్‌గా క్లీన్ చేయడం తప్పనిసరి. అలాగే ఐ లాషెస్ బ్ర్, స్పూలీ, మస్కారా బ్రష్‌తో కనురెప్పల్ని నీట్‌గా క్లీన్ చేయాలి. మీ వెంట్రుకల్ని బ్రష్ చేస్తే కనురెప్పల్ని అంటుకున్న మురికి, దుమ్ము దూరమవుతుంది. అదే విధంగా కనురెప్పల ఆరోగ్యానికి కూడా మంచి పోషకాహారం తీసుకోవడం మంచిది.
జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేసే ఒమేగా 3 ఫుడ్స్, ఆకుకూరలు, చేపలు, అవకాడో వంటివి తినడం వల్ల కనురెప్పలు బలంగా పెరుగుతుంది. రెగ్యులర్‌గా మేకప్ వేయడం వల్ల కూడా ఆ ఆఫెక్ట్ కనురెప్పలపై పడుతుంది. కాబట్టి మస్కారా వంటి వాటికి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. వారానికి ఒకటి, రెండు రోజులు మేకప్ వేసుకోకుండా ఉండాలి. అయితే, కనురెప్పలు అందంగా పొడుగ్గా పెరిగేందుకు కొన్ని టిప్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు వాడొచ్చు. అందుకోసం మీరు సహజ నూనెలు వాడొచ్చు. ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్‌ని వాడొచ్చు. దీని వల్ల మంచి మాయిశ్చరైజేషన్ అందుతుంది.
కనురెప్పలు పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. మస్కారా బ్రష్‌తో ఈ మూడింటిని కలిపి ఓ ఆయిల్‌లా చేసి అప్లై చేయొచ్చు. దీనని వల్ల కనురెప్పలు హైడ్రేట్ అయి, నల్లగా, బలంగా పెరుగుతాయి. అలోవేరా కూడా కనురెప్పల్ని హైడ్రేట్ చేస్తాయి. అలోవేరా రాయడం వల్ల కొల్లాజెన్, మాయిశ్చరైజేషన్ అందుతుంది. దీనిని వాడడం వల్ల హెయిర్ ఫోలికల్స్ హైడ్రేట్ అవుతాయి. ఇందుకోసం కనురెప్పలకి కొద్దిగా వాజిలేన్ రాయవచ్చు. కనురెప్పలు పెరిగేందుకు సీరమ్ కూడా అప్లై చేయొచ్చు. దీనిని రాయడం వల్ల కనురెప్లు పొడుగ్గా పెరుగుతాయి.ఇందుకోసం పెప్టైడ్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉన్న సీరమ్స్ వాడొచ్చు. దీని వల్ల పొడవాటి కనురెప్పలు పెరుగుతాయి.