Dandruff: నిమ్మరసం రాస్తే చుండ్రు తగ్గుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులకు చుండ్రు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతూ
- By Nakshatra Published Date - 09:30 PM, Thu - 20 July 23
ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులకు చుండ్రు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు.. తలపై నుంచి తెల్లటి పొట్టు రాలుతూ ఉండడంతో దానిని చిరాకుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే చుండ్రును తగ్గించుకోవడం కోసం రకరకాల షాంపూలు హెయిర్ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించినా కూడా ఫలితం లేకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. ఇంకొందరు చుండ్రు తగ్గించుకోవడం కోసం హోం రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. మరి చుండ్రును తగ్గించుకోవడం కోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ఒక నిమ్మ కాయ రసం తీసుకొని, ఈ రసాన్ని మీ జుట్టుకి పట్టించి పదిహేను ఇరవై నిమిషాలు అలాగే ఉంచి మామూలుగా హెయిర్ వాష్ చేసేకోవాలి. అలాగే రీటా పౌడర్ తో పేస్ట్ చేసి ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ కి పట్టించాలి. రెండు గంటల తరువాత చల్లని నీటితో కడిగేసి షాంపూ చెసేసుకోండి. రోజ్మేరీ ఆయిల్ ని వెనిగర్ తో కలిపి మీ స్కాల్ప్ కి పట్టించాలి. పదిహేను నిమిషాల తరువాత మామూలుగా హెయిర్ వాష్ చేసేసుకోవాలి. నిమ్మకాయ తొక్కలని నీటిలో ఇరవై నిమిషాల పాటూ మరిగించండి. పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈ మిశ్రమంతో వారానికి ఒకసారి హెయిర్ వాష్ చేయండి. అలాగే మెంతుల్ని రాత్రంతా నానబెట్టి మరునాడు పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి ముప్ఫై నిమిషాలు ఉంచి మామూలుగా హెయిర్ వాష్ చేయాలి.
నీటినీ వెనిగర్ నీ సమాన భాగాల్లో తీసుకుని స్కాల్ప్ కి అప్లై చేయాలి. రాత్రంతా వదిలేసి మరునాడు పొద్దున్న మైల్డ్ బేబీ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. మామూలుగా హెయిర్ వాష్ చేసిన తరువాత ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ తో ఒక సారి హెయిర్ రిన్స్ చేయండి. ఆ తరువాత కండిషనర్ యూజ్ చేయాలి. నీటినీ యాపిల్ సైడర్ వెనిగర్ నీ సమాన భాగాలుగా తీసుకుని స్ప్రే బాటిల్ లో వేసి మీ స్కాల్ప్ మీద స్ప్రే చేయండి. ఆ తరువాత మీ తలకి ఒక టవల్ చుట్టి పదిహేను నిమిషాలు ఉంచండి. మామూలుగా హెయిర్ వాష్ చేసేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.
Related News
Beauty Tips: తలకు నూనె పట్టించి బయటికి వెళ్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
మామూలుగా అమ్మాయిలు,అబ్బాయిలు తలకు ఆయిల్ పెట్టుకోవడం అన్నది సహజం. తల బాగా నొప్పిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయిల్‌తో మసాజ్ చేయండి. దీని