Grey Hair: ఇలా చేస్తే.. ఎంత తెల్లగా ఉన్న జుట్టు అయినా నల్లబడటం ఖాయం?
ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద ఆడ,మగ అని తేడా లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే చిన్న వయసు పిల్లలకు
- By Nakshatra Published Date - 10:00 PM, Thu - 29 June 23
ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద ఆడ,మగ అని తేడా లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే చిన్న వయసు పిల్లలకు కూడా తెల్ల జుట్టు సమస్య వేపిస్తోంది. దీంతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ కలర్స్ వినియోగిస్తున్నప్పటికీ అది కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది. పెద్దవారు మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ని వినియోగిస్తున్నారు కానీ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే శాశ్వతంగా తెల్లజుట్టు రాకుండా ఉండడానికి కొన్ని రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో పాటు ఇంకొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ఉసిరి హెన్నా ను ఉపయోగించడం మంచిది.. ఒక బౌల్ లో ఒక కప్పు తాజా హెన్నా పేస్ట్, మూడు టీ స్పూన్ల ఉసిరి పొడి, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ కలపాలి. పేస్ట్ మరీ థిక్ గా ఉంటే కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు. చేతులకి గ్లౌస్ వేసుకుని అప్లికేటర్ బ్రష్ తో ఈ పేస్ట్ ని మీ హెయిర్ కి పట్టిచాలి. తరువాత ఒక గంట అలాగే వదిలేయాలి. ఆ తరువాత, మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా నెలకి ఒకసారి చేయడం మంచిది.
బ్లాక్ టీ: రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులని ఒక కప్పు నీటిలో మరిగించి,ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారాక, మీ జుట్టుకి అప్లై చేసి గంట పాటు అలా వదిలేయాలి. తరువాత చల్లని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. అయితే ఇందుకు షాంపూ ని ఉపయోగించకూడదు. ఈ విధంగా రెండు వారాలకు ఒకసారి చేయడం మంచిది.
హెన్నా : ఒక కప్పు నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల ప్యూర్ హెన్నా పౌడర్ ని కలిపి ఎనిమిది గంటలు నానబెట్టాలి. ఒక రాత్రంతా కూడా ఉంచవచ్చు. మరునాడు పొద్దున్న రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులని నీటిలో మరిగించి ఆ నీటిని చల్లారనివ్వాలి. చల్లారాక, ఆ నీటిని హెన్నా పేస్ట్ లో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కలపాలి. అన్నీ బాగా కలిసి స్మూత్ పేస్ట్ వచ్చే వరకూ కలపాలి. చేతులకి గ్లోవ్స్ వేసుకుని అప్లికేటర్ బ్రష్ తో ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి గంట అలాగే వదిలేయాలి. తరువాత మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఉసిరి పొడి.. ముందుగా ఒక ఇనుప మూకుడు తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి వేయాలి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కూడా అందులోనే కలపాలి. రెండు బాగా కలిపి స్మూత్ పేస్ట్ వచ్చేలా కలపాలి. అయితే పేస్ట్ మరీ థిక్ గా ఉంటే మరికొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఇనప మూకుడు లోనే అలాగే ఉంచాలి. మరునాడు పొద్దున్న ఈ మిశ్రమాన్ని మీ హెయిర్ కి అప్లై చేసి ఒక గంట వదిలేసి ఆ తరువాత హెయిర్ వాష్ చేసుకోవాలి.
దాల్చిన చెక్క : అర కప్పు వేయించిన దాల్చిన చెక్క పొడి తీసుకొని ఇందులో అర కప్పు క్యారియల్ ఆయిల్ కానీ, కండిషనర్ కానీ కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తడి జుట్టుకి అప్లై చేసి, ఒక గంట అలాగే వదిలేసి తరువాత కడిగేయాలి.
Related News
Jasmine: సువాసనలు వెదజల్లే మల్లెపువ్వుతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండిలా?
మల్లెపువ్వు సువాసన గురించి మనందరికీ తెలిసిందే. దీని సువాసన ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోవడానిక