Drinking Water at Night: రాత్రి సమయంలో నిద్ర పోయేముందు నీరు తాగవచ్చా, తాగకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!
Drinking Water at Night: రాత్రి సమయంలో నిద్రపోయే ముందు నీరు ఎక్కువగా తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- By Anshu Published Date - 08:03 AM, Wed - 1 October 25

Drinking Water at Night: ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి సరిపడినంత నీరు తాగాలి. రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని అయినా తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎండాకాలంలో మరిన్ని ఎక్కువగా తాగాలని చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది నీరు బాగా తాగితే మరికొందరు మాత్రం రోజులో మొత్తం అయినా కూడా రెండు లీటర్ల నీటిని కూడా తాగరు. కొందరు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు కూడా నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.
ఇలా తాగడం వల్ల రాత్రంతా హైడ్రిటేట్ గా ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా రాత్రి సమయంలో ఎక్కువగా నీటిని తాగుతున్నారా. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిందే. కాగా నిద్రపోయే ముందు నీరు తాగితే డీహైడ్రేషన్ ను నివారించవచ్చట. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపడానికి, కీళ్ల నొప్పులను దూరం చేసేందుకు హెల్ప్ చేస్తుందట. ముఖ్యంగా వేడి వాతావరణంలో, రాత్రిపూట చెమటలు పట్టే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
శరీరాన్ని బాగా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చట. అలాంటి సమయంలో ఇది మంచి నిద్రకు కూడా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. అలాగే తగినంత నీరు తాగడం వల్ల మూడ్ మెరుగుపడుతుందట. చిరాకు తగ్గుతుందట. అదేవిధంగా రాత్రి నీరు తాగి పడుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని, అలాగే ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుందని చెబుతున్నారు. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే అది సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుందట. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందని, చెమట ఉత్పత్తిని పెంచుతుందని చెబుతున్నారు.
నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను కలిపి తాగడం వల్ల రుచి పెరగడమే కాకుండా విటమిన్ సి కూడా పెరుగుతుందని ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే నిద్రపోయే ముందు నీరు ఎక్కువగా తాగడం వల్ల రాత్రుల్లు పదేపదే మూత్ర విసర్జన కోసం లేవాల్సి వస్తుందని, ఇది నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుందని, దీనివల్ల నిద్రలేమి సమస్య తలెత్తవచ్చని చెబుతున్నారు. తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం, సరైన నిద్ర లేకపోవడం ఎక్కువకాలం కొనసాగితే గుండె ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం పడుతుందట. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట నిద్రపోయే ముందు నీరు తాగే అలవాటు ఉన్నవారు నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు తాగాలని చెబుతున్నారు.