Lemon Peel : నిమ్మకాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
నిమ్మకాయ తొక్కలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
- By News Desk Published Date - 07:58 AM, Tue - 15 April 25

Lemon Peel : నిమ్మకాయలు మనం పులిహార చేసుకోవడానికి, సోడా లలో, షర్బత్ లలో.. ఇలా రకరకాలుగా ఫుడ్ లో వాడుతుంటాము. నిమ్మకాయలు మనం పులుపు కోసం వాడుతుంటాము. అయితే నిమ్మకాయలు వాడినప్పుడు మనం అందరం వాటి తొక్కలు పడేస్తుంటాము. కానీ నిమ్మకాయ తొక్కలను ఉపయోగించి మనం ఇంటిని ఎంతో సువాసనభరితంగా మరియు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
*నిమ్మకాయ తొక్కలతో మనం రూమ్ ఫ్రెషనర్ ను తయారుచేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలను కొన్నింటిని కుండలో వేసి వాటికి కొద్దిగా రోజ్ మేరీ నూనె లేదా ఆ చెట్టు యొక్క చిన్న బెరడు ముక్కను వేయాలి. ఆ తరువాత దానిని కాసేపు స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అప్పుడు మనకు దాని నుండి మంచి సువాసన అనేది వెలువడుతుంది.
*నిమ్మకాయ తొక్కలను బాగా ఎండబెట్టాలి. అవి బాగా ఎండిన తరువాత వాటిని పొడి చేయాలి. ఆ పొడిని చిన్న చిన్న సంచులలో వేసి మన ఇంటి మూలల్లో పెడితే మంచి సువాసన వస్తుంది. ఇలా నిమ్మకాయ తొక్కలతో రూమ్ ఫ్రెషనర్ ను రెండు విధాలుగా తయారుచేసుకోవచ్చు.
*నిమ్మకాయ తొక్కలలో ఆమ్ల యాంటి- బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి కాబట్టి దీనిని క్లీనింగ్ స్ప్రే గా ఉపయోగించుకోవచ్చు. దాని కొరకు నిమ్మకాయ తొక్కలను, వైట్ వెనిగర్ ను ఒక కూజా లో వేసి రెండు వారాల పాటు ఉంచాలి. అలా ఉంచడం వలన అది ఒక క్లీనింగ్ స్ప్రే గా తయారవుతుంది. దీనిని ఒక ఖాళీ స్ప్రే బాటిల్ లో పోసుకొని సగం నీరు కలుపుకొని స్టీల్, గాజు వంటి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి స్ప్రే గా వాడుకోవచ్చు.
*నిమ్మకాయ తొక్కలకు నీళ్లను కలిపి మైక్రో ఒవేన్ లో మూడు నిముషాలు ఉంచితే దానిలో మరకలు అన్నీ పోతాయి.
*నిమ్మకాయ తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే దానిని మనం వంటకాలలో కూడా ఉపయోగించుకోవచ్చు. సలాడ్లు, ఉడికించిన కూరగాయలలో చల్లుకుంటే రుచి బాగుంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.
Also Read : Summer Drinks : వేసవిలో శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా ఈ డ్రింక్స్ తాగండి..