Caffeine Effects: ఈ సమస్యలు ఉంటే కాఫీ అస్సలు తాగకూడదు.. అవేంటంటే?
caffeine effects: చాలామంది కాపీ ప్రేమికులు ఉదయం వారి దినచర్యను కాఫీ తో మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది రోజుకు ఒక్కసారైనా కాఫీ తాగుతూ ఉంటారు. ఒక రోజు కాఫీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి పట్టినట్టుగా ఏదోలా ఉంటుంది. ఇంతలా కాఫీలు టీలకు మనుషులు ఎడిక్ట్ అయిపోయారు
- By Anshu Published Date - 08:30 AM, Sun - 16 October 22

Caffeine Effects: చాలామంది కాపీ ప్రేమికులు ఉదయం వారి దినచర్యను కాఫీ తో మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది రోజుకు ఒక్కసారైనా కాఫీ తాగుతూ ఉంటారు. ఒక రోజు కాఫీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి పట్టినట్టుగా ఏదోలా ఉంటుంది. ఇంతలా కాఫీలు టీలకు మనుషులు ఎడిక్ట్ అయిపోయారు. అయితే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, అతిగా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ కెఫిన్ అనే పదార్థం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
అంతే కాదండోయ్ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కూడా కాపీని తాగకూడదట. మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాపీని తాగకూడదు? ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరిథ్మియా..గుండెకు సంబంధించిన ఒక రకమైన సమస్యలలో ఇది కూడా ఒకటి. సమస్య ఉన్నవారికి గుండె ఇతరులకు కొట్టుకున్న విధంగా సాధారణంగా కొట్టుకోదు. ఈ సమస్యతో బాధపడే వారు కాపీని అస్సలు ముట్టకూడదు.
ఈ సమస్య ఉన్నవారు కాపీని తాగడం వల్ల బీపీని అమాంతం పెంచేస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా కాఫీని తాగకూడదు. గర్భిణీ స్త్రీలు కాపీని తాగడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కాఫీని తాగితే పోషక లోపం సమస్యతో కూడా బాధపడవచ్చు. అలాగే బాలింతలు కూడా కాపీని తాగకూడదు. బాలింతలు కాఫీ తాగడం వల్ల బాడీలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ బారిన పడతారు. బాలింతలు కాఫీ ఎక్కువ సార్లు తాగితే మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా కాపీని తాగకూడదు. నిద్ర లేని సమస్యతో బాధపడేవారు కాఫీని తాగడం వల్ల అది నిద్రను మరింత దూరం చేస్తుంది.