Hair Tips: జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే నెయ్యితో ఇలా చేయాల్సిందే!
జుట్టుకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారికీ నెయ్యి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి నెయ్యితో జుట్టు సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:52 AM, Sat - 15 March 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టుకి సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. అందమైన కురులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ జుట్టు సమస్యల కారణంగా వెంట్రుకలు రాలిపోవడం చిట్లిపోవడం తెల్లగా మారడం చుండ్రు ఇలా చాలా రకాల సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలు రావడానికి మన జీవనశైలి ప్రధాన కారణం అని చెప్పాలి. కాగా అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉండకూడదు అంటే నెయ్యిని తప్పనిసరిగా వినియోగించాలని చెబుతున్నారు.
మరి నెయ్యితో జుట్టు సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యితో జుట్టుకు బాగా మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుందట. అలాగే జుట్టు కూడా వేగంగా పెరుగుతుందట. నెయ్యి జుట్టుకు పోషకాలను అందించడంతో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుందట. కాబట్టి జుట్టు సహజంగా పెరగడానికి నెయ్యి సహాయపడుతుందని చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్, ఫ్యాటీ యాసిడ్ గుణాలు నెయ్యిలో చాలా ఉన్నాయి. ఈ రెండు కారకాలు జుట్టు,స్కాల్ప్ కు చాలా మేలు చేస్తాయట. కాగా నెయ్యిలో విటమిన్ ఎ , ఇ, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయట.
కాగా నెయ్యిలోని విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని నివారిస్తుందట. అలాగే శిరోజాలను బలపరుస్తుందట. నెయ్యి మసాజ్ వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయట. జుట్టులో రక్త ప్రసరణ పెరుగుతుందని,ఇది చుండ్రును తొలగిస్తుందని చెబుతున్నారు. నెయ్యిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయట. నెయ్యిని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు మెరుపును పెంచుతుందట. అలాగే వాటిని మృదువుగా చేస్తుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం కాస్త దేశీ నెయ్యి తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. వేడి నెయ్యి జుట్టు రంధ్రాలలోకి బాగా కలిసిపోతుంది. దేశీ నెయ్యితో మీ స్కాల్ప్ , జుట్టు మూలాలను మసాజ్ చేయాలి. దీన్ని సున్నితంగా అప్లై చేయాలి. తద్వారా ఇది తలలో బాగా శోషించబడుతుందట. నెయ్యిని జుట్టు మీద కనీసం ఒక గంట లేదా రాత్రిపూట అలాగే ఉంచాలట. దీంతో జుట్టుకు పుష్కలంగా పోషణ లభిస్తుందట. తర్వాత తల స్నానం చేస్తే జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు.