HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Cucumber Benefits For Acne Prone Skin

Beauty Tips: ముఖంపై మొటిమలు నల్లటి మచ్చలు తగ్గాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే?

చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా యువత ముఖంపై నల్లటి మచ్చలు,మొటిమలు వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.

  • Author : Anshu Date : 18-03-2024 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 18 Mar 2024 04 43 Pm 5723
Mixcollage 18 Mar 2024 04 43 Pm 5723

చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా యువత ముఖంపై నల్లటి మచ్చలు,మొటిమలు వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. వీటిని తొలగించుకోవడం కోసం ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు రకరకాల హోమ్ రెమిడీలు ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ముఖంపై మొటిమలు నల్లటి మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా రెగ్యులర్‌గా ఫేస్ మాస్క్స్ వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫేస్ మాస్క్స్ ని రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ మాస్క్స్ ని వారానికి ఒకసారీ, రెండు సార్లూ యూజ్ చేయవచ్చు.

రోజూ కూడా యూజ్ చేసుకోవచ్చు. హోం మేడ్ ఫేస్ మాస్క్స్ లో అన్నీ నాచురల్ ఇంగ్రీడియెంట్సే ఉంటాయి. కాబట్టి, రోజూ వాడినా కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. మరి ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫేస్ మాస్క్స్ వల్ల అవుట్‌సైడ్ అప్పియరెన్స్ బాగుండడమే కాదు, ఎంతో రిలాక్సింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఈ ఫేస్ మాస్క్స్‌లో ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకుంటే నీరసం ఎగిరిపోయి ఉత్సాహంగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు కొంత సమయం మీ చేతిలో ఉండేలా చూసుకోవాలి. రూం ఫ్రెషనర్ యూజ్ చేస్తారో, అగరువత్తులు వెలిగించుకుంటారో మీ ఇష్టం. మంచి రూమ్‌లో మంచి మ్యూజిక్ పెట్టుకునీ మంచి స్మెల్ కూడా వస్తుంటే ఫేస్ మాస్క్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు.

మీకు గ్లోయింగ్ స్కిన్‌తో పాటూ ఒక వండర్‌ఫుల్ ఎక్స్పీరియెన్స్ సొంతం అవుతుంది. అదేవిధంగా రెగ్యులర్‌గా ఫేస్ క్లెన్సర్ వాడడం వల్ల మురికీ, జిడ్డూ, మేకప్, ఇంకా ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోతాయి. కానీ, ఫేస్ మాస్క్ ఈ క్లెన్సింగ్ ప్రాసెస్‌ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. రెగ్యులర్ క్లెన్సింగ్ పైపైన ఉండే ఇన్‌ప్యూరిటీస్‌నే తొలగిస్తుంది. ఫేస్ మాస్క్స్ మాత్రం చర్మం లోపల దాక్కుని ఉన్న ఇన్‌ ప్యూరిటీస్ ని కూడా బైటికి తీసుకొస్తాయి. ఈ డీప్ క్లెన్సింగ్ ఫేస్ మాస్క్స్ మాత్రమే చేయగలుగుతాయి. రెగ్యులర్ ఫేస్ క్లెన్సర్స్ వల్ల ఇలాంటి క్లెన్సింగ్ జరగదు. క్లాగ్డ్ పోర్స్ అంటే అర్ధం ట్రబుల్. ఇంప్యూరిటీస్ అన్నీ లోపల ఉండిపోయి అక్కడ బాక్టీరియా ని డెవలప్ చేసి యాక్నే కీ, బ్లెమిషెస్ కీ, ఇంకా రకరకాల స్కిన్ ప్రాబ్లంస్ ని క్రియేట్ చేస్తాయి. ఫేస్ మాస్క్స్ పోర్స్ ని అన్ క్లాగ్ చేస్తాయి. స్కిన్ సర్ఫేస్ ని క్లీన్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తాయి. ఫేస్ మాస్క్ వేసుకున్నాక మాస్క్ ఫేస్ మీద డ్రై అవ్వడం, గట్టి పడడం, మాస్క్ ని పీల్ చేయడం వలన స్కిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది.

దీని వలన స్కిన్ టోన్ లో మంచి మార్పు కనపడుతుంది. స్కిన్ సాఫ్ట్ గా స్మూత్ గా అవ్వడం తో పాటూ మంచి గ్లో వచ్చి చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. పేస్ మాస్క్స్ మిగిలిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎఫెక్టివ్ గా వర్క్ చేసేలా చేస్తాయి. మీ డే క్రీములూ, నైట్ క్రీములూ, సీరంస్ బాగా పని చేయాలంటే, స్కిన్ లోకి డీప్ గా వెళ్ళాలంటే ఫేస్ మాస్క్ కంపల్సరీ. రెగ్యులర్ గా ఫేస్ మాస్క్స్ వాడడం వల్ల సీటీఎం రొటీన్ వల్ల వెచ్చే రిజల్స్ అమేజింగ్ గా ఉంటాయి. కాగా కుకుంబర్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికీ వస్తే… కుకుంబర్ ని తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి. తర్వాత అది పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్ట్ ని వడకట్టాలి. అందు వల్ల అందులో ఉన్న గింజలు రాకుండా పేస్ట్ స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఫేస్ క్లీన్ చేసుకుని ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేయడమే. అప్లై చేశాక పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. మీకు కావాలనుకుంటే కుకుంబర్ పేస్ట్ ముఖానికి అప్లై చేయబోయే ముందు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • cucumber
  • cucumber face mask

Related News

Control Dandruff

చుండ్రు, తలపై దురదను తగ్గించే సింపుల్ చిట్కా..ఇలా చేస్తే చాలు ?

Control Dandruff :  శీతాకాలం అయినా లేదా మారుతున్న వాతావరణం అయినా సరే చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. ఇది తల దురదకు కారణమవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. మార్కెట్లో దొరికే షాంపూలు లేదా నూనెలు వాడటం వల్ల జుట్టు ఇంకా పొడిబారుతుంది. నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు పెరుగు మంచి ఆప్షన్ కావచ్చు. డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృష్ణ బలాలా పెరుగుతో అలాంటి ఓ సింపుల్ చిట్క

    Latest News

    • వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ వార్నింగ్

    • మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?

    • రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!

    • అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!

    • రైతులకు గుడ్ న్యూస్..గోద్రేజ్ ఆగ్రోవెట్ నుండి ‘TAKAI’ వచ్చేసింది

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd