Egg Pakora: ఎంతో స్పైసీగా ఉండే కరకరలాడే ఎగ్ పకోడా.. తయారు చేసుకోండిలా?
గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే చాలామంది వారంలో కనీసం నాలుగు ఐదు సార్లు గుడ్డు
- By Anshu Published Date - 08:00 PM, Mon - 31 July 23

గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే చాలామంది వారంలో కనీసం నాలుగు ఐదు సార్లు గుడ్డును తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు గుడ్డుని రెసిపి రూపంలో తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టి తీసుకుంటూ ఉంటారు.. ఎగ్ రైస్, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఇలా గుడ్డు రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఎంతో స్పైసీగా కరకరలాడే ఎగ్ పకోడాని ట్రై చేశారా. ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఎగ్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలి? అందుకోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎగ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు:
గుడ్లు – 2
శెనగపిండి – ఒక కప్పు
ఉల్లిపాయలు – 3
అల్లం – టీస్పూన్
వెల్లుల్లి – కొన్ని
పచ్చిమిర్చి – కొన్ని
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – సరిపడా
పసుపు – అర టీ స్పూన్
కారంపొడి – సరిపడా
ధనియాల పొడి – సరిపడా
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్లు
బియ్యం పొడి – 2 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
నూనె – సరిపడా
ఎగ్ పకోడా తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, అన్నీ తీసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత గుడ్డు, బియ్యం పొడి, కార్న్‌ఫ్లోర్, బీసన్‌తో మళ్లీ కలపాలి.
తరువాత గుడ్లను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా కలుపుకున్నా మిశ్రమంతో కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో తగినంత నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఆ మిశ్రమంలో ఉడకబెట్టిన గుడ్లను అద్దుకొని ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే ఎగ్ పకోడా రెడీ.