Coconut Rice: ఎప్పుడైనా కొబ్బరి అన్నం తిన్నారా.. తయారు చేసుకోండిలా?
మామూలుగా మనం రైస్ లో టమోటా రైస్,లెమన్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్, చింతపండు రైస్ లాంటి వెరైటీ వెరైటీ రైస్ లను తింటూ ఉంటారు. అయితే మీర
- By Anshu Published Date - 08:30 PM, Tue - 18 July 23

మామూలుగా మనం రైస్ లో టమోటా రైస్,లెమన్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్, చింతపండు రైస్ లాంటి వెరైటీ వెరైటీ రైస్ లను తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా కొబ్బరి రైస్ ని ట్రై చేశారా. చాలా వరకు చాలా మంది కొబ్బరి రైస్ ని తిని ఉండరు. మరి కొబ్బరి రైస్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి? అందుకోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి అన్నంకి కావలసిన పదార్థాలు:
బియ్యం – 1 కప్పు
కొబ్బరి తురుము – 1/4 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
పప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 1
మిరపకాయ – 1
కరివేపాకు – కొద్దిగా
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్
కొబ్బరి అన్నం తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, శెనగపప్పు వేసి తాలింపు వేయాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు తక్కువ వేడి మీద వేయించాలి. తర్వాత అన్నం వేసి, రుచికి సరిపడా ఉప్పు చల్లి బాగా గిలకొట్టుకుంటే రుచికరమైన కొబ్బరి అన్నం సిద్ధం. ఈ కొబ్బరి అన్నాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు.