Chilli Chicken: ఎంతో స్పైసీగా ఉండే చిల్లి చికెన్.. ట్రై చేయండిలా?
సాధారణంగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ బిర్యాని, చికెన్ 65,చికెన్ లాలీ పాప్స్, తందూర
- By Anshu Published Date - 10:00 PM, Mon - 18 September 23

సాధారణంగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ బిర్యాని, చికెన్ 65,చికెన్ లాలీ పాప్స్, తందూరి చికెన్, చికెన్ నగ్గెట్స్, చికెన్ రోల్స్ ఇలా ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా చిల్లి చికెన్ రెసిపీ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే ఈ చిల్లి చికెన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చిల్లి చికెన్ రెసిపికి కావలసిన పదార్థాలు
చికెన్ -1 కేజీ
పచ్చి మిరపకాయలు – 200 గ్రాములు
గరం మసాల – 1 స్పూన్
అల్లం ,వెల్లుల్లి పేస్ట్ – 3 స్పూన్స్
ఉల్లిపాయలు – 300 గ్రాములు
కారం – 3 స్పూన్స్
నూనె – తగినంత
యాలకులు – 5
పసుపు – 2 స్పూన్స్
చిల్లి చికెన్ రెసిపి తయారీ:
ముందుగా చికెన్ ను బాగా కడిగి అందులో కొంచం ఆయిల్ , కారం, పసుపు వేసి బాగా కలుపుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి, అవి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత దానిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి అందులో సరిపడా నీళ్ళు పొయ్యాలి. ఆ తరువాత నానబెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి. ముప్పావ్ బాగం ఉడికాక కప్పు నీళ్ళు పోసి కలిపి కట్ చేసుకున్న పచ్చి మిర్చి, గరం మసాల వేసి 10 నిమిషాలు ఉడికించాలి. చివర్లో యాలకులు వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే చిల్లి చికెన్ రెసిపి రెడీ..