Chicken Manchuria: ఎంతో స్పైసీగా ఉంటే చికెన్ మంచూరియా.. తయారీ విధానం?
మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ముఖ్యంగా ఇంట్లో కంటే బయట హోటల్స్ లో ఎక్కువగా చికెన్ సంబంధిం
- By Nakshatra Published Date - 08:10 PM, Tue - 5 September 23
మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ముఖ్యంగా ఇంట్లో కంటే బయట హోటల్స్ లో ఎక్కువగా చికెన్ సంబంధించిన రెసిపీలు మనకు లభిస్తూ ఉంటాయి. చికెన్ పకోడా, చికెన్ రోల్స్ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యాని, చికెన్ ఫ్రై అంటూ రకరకాల వంటలు మనం తినే ఉంటాం. అయితే చాలా వరకు చాలా మంది బయట ఫుడ్ ని కాకుండా ఇంటి ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వారు ఇంట్లోనే చికెన్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో,అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చికెన్ మంచూరియాకి కావలసిన పదార్థాలు
చికెన్ (బోన్ లెస్) – పావుకేజీ
ఉల్లిపాయలు – రెండు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీ స్పూన్
పచ్చిమిర్చి – నాలుగు
కోడిగుడ్డు – ఒకటి
మైదాపిండి – చిన్న కప్పు
సోయాసాస్ – ఒక స్పూను
చిల్లీ సాస్ – కొద్దిగా
వెనిగర్ – ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను
టమోటా సాస్ – ఒక టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – తగినంత
చికెన్ మంచూరియా తయారీ విధానం:
ఇందుకోసం మొదట చికెన్‌ను శుభ్రంగా కడిగి తర్వాత చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్, తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి. ఆపై ఒక బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ చేర్చి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేయించాలి. అలాగే తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేర్చి హాట్ హాట్‌గా ఫ్రైడ్ రైస్, రోటీలకు సైడ్ డిష్‌గా సర్వ్ చేయాలి. అంతే ఎంతో స్పైసీ గా ఉండే చికెన్ మంచూరియా రెడీ.
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్‌వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�