Gastric Problem: గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే తమలపాకుతో చెక్ పెట్టండిలా?
Gastric Problem: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి.
- Author : Anshu
Date : 09-10-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Gastric Problem: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్టిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహిక లోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీంతో కడుపులో మంటగా అనిపించడం నొప్పిగా అనిపించడం అది కాస్త పెద్దదిగా అయ్యి వికారం లాంటి సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. దీంతో ఈ గ్యాస్ సమస్యకు ఎప్పుడు చాలామంది మందులపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.
అయితే ఈ మందులను వాడడం వల్ల ఆ కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది కానీ ఈ మందులు దీర్ఘకాలికంగా ఉపయోగపడవు. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కడుపున ప్రశాంతంగా ఉంచడంలో గ్యాస్టిక్ సమస్యను తగ్గించడంలో తమలపాకు చక్కగా ఉపయోగపడుతుంది. తమలపాకుతో గ్యాస్ కి సమస్యలను ఏ విధంగా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భారతదేశంలో భోజనం అనంతరం తమలపాకును నమలడం లేదా పాన్ వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొందరు గుల్కంద్, తరిగిన వాల్‌నట్‌లు, కొబ్బరి పొడి, తేనె, లవంగాలు ,యాలకుల గింజలు వేస్తారు. ఈ పాన్ తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్టిక్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు లో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ , యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. కాగా ఇవి మన జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అంతే కాకుండా లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. అలాగే తమలపాకుల నుండి నూనెను తయారు చేసి, మీ కడుపుపై మసాజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. అలాగే జ్యూస్‌లు ,జీర్ణ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తమలపాకులో విటమిన్ సి థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ ,కెరోటిన్ వంటి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగగా లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలోని pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగండి లేదా నానబెట్టిన తమలపాకులను అది గ్యాస్టిక్ సమస్యను దూరం చేస్తుంది.