Multani Mitti: ముల్తానీ మట్టి ముఖానికి ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలివే?
ముల్తానీ మట్టి వల్ల అందానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు ఈ ముల్తానీ
- By Nakshatra Published Date - 10:35 PM, Wed - 6 September 23
ముల్తానీ మట్టి వల్ల అందానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు ఈ ముల్తానీ మట్టిని అందానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్ లలో ముల్తానీ మట్టిని వినియోగిస్తున్నారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముల్తానీ మట్టిలో ఉండే వివిధ రకాల మినరల్స్, న్యూట్రీషియన్స్ చర్మానికి పోషణను అందిస్తాయి. ముల్తానీ మిట్టి జిడ్డుగల చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి నూనెను తొలగించే శక్తి ఉంది. ముల్తానీ మట్టి చర్మం రంధ్రాలలో ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది.
ముల్తానీ మట్టి ముఖం చర్మంపై ఉండే రంధ్రాలను మూసేసి బిగుతుగా మారుస్తుంది. దీని వల్ల చర్మం ఆకృతి మెరుగ్గా ఉంటుంది. ఈ బంకమట్టి చర్మాన్ని టోన్ చేయడానికి, కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా కూడా చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మంపై ఉండే రంధ్రాలను ఆయిల్ ఫ్రీ చేస్తుంది. దీంతో మొటిమల సమస్యను తొలగిపోతుంది. ముల్తానీ మట్టిని ఉపయోగించడానికి మీరు దీనిని రోజ్ వాటర్ వంటి ఇతర వస్తువులతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ ను వేసుకోవచ్చు. ఎన్నో గుణాలు సమృద్ధిగా ఉండే ముల్తానీ మట్టిని ముఖానికి సంబంధించిన చాలా సమస్యలకు ఉపయోగించవచ్చు.
జిడ్డుగల చర్మం నుంచి మొటిమల వరకు ఏ రకమైన సమస్య ఉన్నా మీరు ముల్తానీ మట్టిని ఉపయోగించవచ్చు. కాగా ముల్తానీ మట్టి మొటిమలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని గ్రైండ్ గంధం, రోజ్ వాటర్, వేప ఆకుల పొడితో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లైచేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. ఒకవేళ మీ చర్మం జిడ్డుగా ఉంటే ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. పేస్ట్ ను తయారు చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి పెదాలు, కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాలకు తాకకుండా అప్లై చేసుకోవాలి. అదేవిదంగా మీ చర్మం నార్మల్ గా ఉంటే అంటే మరీ పొడిబారిన లేదా జిడ్డుగల చర్మం లేకపోతే ముల్తానీ మట్టిని తేనె, పెరుగులో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
Related News
Multani Mitti: చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ముల్తానీ మట్టిని ఉపయోగించాల్సిందే?
ముల్తానీమట్టి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడు