Green Chilie: ఏంటి.. పచ్చిమిర్చి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?
Green Chilie: పచ్చిమిర్చిని తరచుగా తీసుకోవడం అనేక ప్రయోజనాలు కలుగుతాయని ముఖ్యంగా ఉండే బ్లూటూత్ ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. మరి ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Fri - 3 October 25

Green Chilie: మన వంటింట్లో దొరికే కాయగూరలలో పచ్చిమిర్చి కూడా ఒకటి. ఇవి రుచి కారంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొద్దిగా తిన్నా చాలు కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. కొంతమంది పచ్చిమిర్చి ఆహార పదార్థాలతో పాటు తింటే మరి కొందరు తినడానికి అసలు ఇష్టపడరు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పచ్చిమిర్చి వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా దీనిని తింటే గుండె సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
కాగా పచ్చిమిరపకాయలలో విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి. ఇందులో ఉండే కాప్సైసిన్ అనే మూలకం పచ్చిమిర్చి ఘాటుగా ఉండేలా చేస్తుందట. ఇది శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. అలాగే పచ్చిమిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుందట. రక్త ప్రసరణను మెరుగుపరిచి ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. కాగా పచ్చి మిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయట. వాపు గుండె జబ్బులకు ప్రధాన కారణం అని, కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
అలాగే పచ్చిమిరపకాయలు గుండెకు మాత్రమే కాదు క్యాన్సర్ నుంచి కూడా శరీరానికి రక్షిస్తాయట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయని, క్యాప్సెసిన్ కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తుందని చెబుతున్నారు. పచ్చిమిర్చిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుందట. పచ్చిమిర్చిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఇది ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందట. దానివల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుందట. పచ్చిమిర్చి గుండెకు మంచిది. కానీ ఎక్కువగా తింటే నష్టం కూడా కలుగుతుందట. ఇది కడుపులో మంట, ఎసిడిటీ, పుండ్లకు కారణం కావచ్చని, కాబట్టి ఎల్లప్పుడూ సమతుల్య పరిమాణంలోనే తీసుకోవాలని చెబుతున్నారు.