Ghee Face Packs : చలికాలంలో ముఖం మెరవడానికి, మృదువుగా ఉండటానికి నెయ్యితో ఇలా..
మన ఇంటిలో ఉండే నెయ్యితో ఫేస్ ప్యాక్(Ghee Face Packs) చేసుకుంటే అవి మనకు ఎలాంటి హాని కలిగించవు.
- Author : News Desk
Date : 31-10-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
చలికాలంలో(Winter) ముఖం మెరవడానికి మనం కొన్ని రకాల ఫేస్ క్రీములు, లోషన్, ఫేస్ ప్యాక్ లు వాడుతుంటాము. అయితే వాటిలో చాలా రకాల రసాయనాలు కలుపుతారు ఇంకా అవి మన ముఖానికి పడతాయి లేదా పడవు. కానీ మన ఇంటిలో ఉండే నెయ్యితో ఫేస్ ప్యాక్(Ghee Face Packs) చేసుకుంటే అవి మనకు ఎలాంటి హాని కలిగించవు. చలికాలంలో నెయ్యితో ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే ఎంతో మంచిది. దీని వలన మన ముఖం మెరుస్తుంది. ఈ కాలంలో పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల నెయ్యిని కలిపి దానిని మన ముఖానికి రాసుకోవాలి. ఇది రాసుకున్న ఇరవై నిముషాల తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన మన ముఖం పైన మొటిమల వల్ల వచ్చే వాపులు తగ్గుతాయి. మన పొడి చర్మం మృదువుగా మారుతుంది. రెండు స్పూన్ల కలబంద గుజ్జు, ఒక స్పూన్ నెయ్యి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది.
ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నెయ్యి కలిపి దానిని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మన ముఖం పైన వచ్చిన ముడతలు వంటివి తగ్గుతాయి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మనం మన ముఖానికి నెయ్యితో ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం వలన మన ముఖం మెరుస్తూ కనబడుతుంది. పూర్వకాలంలో మన పెద్దలు చలికాలంలో పేదలకు, కాళ్లకు, చేతులకు మృదువుగా ఉండటానికి, మెరవడానికి వెన్న, నెయ్యి లాంటివి ఉపయోగించేవారు.
Also Read : Apple Jam : టేస్టీ ఆపిల్ జామ్ రెసిపీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?