Coriander : కొత్తిమీర తినడం వలన కలిగే అనేక ప్రయోజనాలు..
మనం రోజూ వండుకునే కూరల్లో కొత్తిమీర(Coriander) వేసుకుంటూ ఉండాలి. కొత్తిమీర ను కొంతమంది విరివిగా వాడుతుంటారు. కానీ కొంతమంది తినడానికి ఇష్టపడరు.
- Author : News Desk
Date : 09-10-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మనం అనేక రకాల వ్యాధుల బారిన పడవలసి వస్తుంది. లేదా తొందరగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి గురికావలసి వస్తుంది. కాబట్టి మనం తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు గల ఆహారాన్ని చేర్చుకోవాలి. దీని వలన మనం తొందరగా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము. మనం రోజూ వండుకునే కూరల్లో కొత్తిమీర(Coriander) వేసుకుంటూ ఉండాలి. కొత్తిమీర ను కొంతమంది విరివిగా వాడుతుంటారు. కానీ కొంతమంది తినడానికి ఇష్టపడరు.
మనం కొత్తిమీరను కూరల్లో, సాంబార్, రసం, బిర్యానీ, రైస్ ఐటమ్స్.. ఇలా అన్నిట్లో వేసుకోవచ్చు. కొత్తిమీరతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. మనం చేసుకునే అన్ని రకాల వంటల్లో గార్నిష్ లాగా ఉపయోగించుకోవచ్చు. కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్తిమీరను ఏదో రకంగా మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మనకు అనారోగ్యాలు తొందరగా దరిచేరవు. కొతిమీరలో విటమిన్ ఎ, సి, బి, కె ఉన్నాయి. ఇంకా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటివి ఉన్నాయి.
కొతిమీరలో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కొత్తిమీర తినడం వలన అది మనలో జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. రక్తపోటును కంట్రోల్లో ఉంచడానికి కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీరను రోజూ తినడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అసిడిటీ ఉన్నవారికి కూడా కొత్తిమీర ఒక మందులాగా పనిచేస్తుంది.
కొత్తిమీర తినడం వలన అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. కొత్తిమీర తినడం వలన దద్దుర్లు, ఎలర్జీ వంటివి రాకుండా ఉంటాయి. ఏమైనా ఉన్న అవి తగ్గుముఖం పడతాయి. కొత్తిమీర లోని ఔషధ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కణాలను అడ్డుకొని రాకుండా చేస్తుంది. కొత్తిమీర రసం కూడా చేసుకొని తాగవచ్చు, దీని వలన బరువు తగ్గుతారు. కొత్తిమీర రోజూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు సమస్యలు తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. అందుకే ఏదో రకంగా కొత్తిమీరని మన ఆహారంలో భాగం చేసుకోవాలి.
Also Read : Honey With Milk Benefits: పాలలో తేనె కలిపి తాగితే ఎన్నో బెనిఫిట్స్.. ముఖ్యంగా అలాంటి వారికి..!