Jaggery: ఏంటి.. బెల్లం కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుందా?
బెల్లం కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. మరి బెల్లంని అందానికి ఏ విధంగా ఉపయోగించాలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:45 PM, Mon - 28 April 25

మామూలుగా అమ్మాయిలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ నాచురల్ అందాన్ని తగ్గిస్తాయి. కానీ మీరు వీటికి బదులుగా హోం మేడ్ ప్రొడక్ట్స్ ను వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయట.
అయితే ఇందుకోసం బెల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బెల్లం ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. మీకు చర్మ సమస్యలు ఉంటే గనుక ఎలాంటి నష్టాన్ని కలిగించని బెల్లాన్ని ఉపయోగించడం మంచిది. బెల్లం మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని మన ముఖానికి అప్లై చేసి మన చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేయవచ్చు. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెల్లం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుందట. అలాగే ముఖంపై ఉండే నల్ల మచ్చలను, మొటిమలను తగ్గించడానికి బాగా సహాయపడుతుందట.
ఇది మన చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా బెల్లం మన ముఖంపై ముడతలను, గీతలను తగ్గిస్తుందట. అంతేకాకుండా బెల్లం ముఖం పొడిబారడం, దురదను సమస్యలను కూడా తగ్గిస్తుందట. అందుకే ముఖం అందంగా కనిపించడానికి బెల్లం ఫేస్ ప్యాక్ ను వాడాలి అంటారు. బెల్లం, శెనగపిండి ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో ఒక చెంచా శెనగపిండి, పాలు బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. అదేవిధంగా ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో ఒక చెంచా తేనె, నిమ్మరసం వేసి కలపి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలట. 5 నిముషాలు అలాగే ఉంచి కడిగేసుకుంటే సరిపోతుందట.