Beauty Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?
మామూలుగా స్త్రీలు చాలా మంది అవాంచిత రోమాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అవాంచిత రోమాల కారణంగా అందవిహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు. పె
- By Nakshatra Published Date - 08:30 PM, Sun - 14 January 24
మామూలుగా స్త్రీలు చాలా మంది అవాంచిత రోమాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అవాంచిత రోమాల కారణంగా అందవిహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు. పెదవి పై భాగంలో, గడ్డం మీద అలాగే చెవుల దగ్గర, చంపలపై ఎక్కువగా వస్తుంటాయి. దీంతో వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకొందరు రకరకాల బ్యూటీ ప్రొడక్టులను ఉపయోగిస్తే మరి కొందరు హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. ఆ సమయంలో ఇవి తగ్గినప్పటికీ మళ్లీ మొదలవుతూ ఉంటాయి. అయితే ఈ అవాంఛిత రోమాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముందుగా పటిక బెల్లాన్ని తీసుకొని దాన్ని పౌడర్ గా చేసుకోవాలి. ఒక స్పూన్ పటిక బెల్లాన్ని తీసుకొని దానిలో రెండు చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతకు ముందు ముఖాన్ని క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మంచి కాటన్ తో ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల శనగపిండి వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ పటిక బెల్లం పొడి కూడా వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మూడు చుక్కల కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె వద్దనుకున్న వాళ్లు బాదం నూనె కూడా వేసుకోవచ్చు.
నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మరసం వేసుకోవాలి. దీనిలో రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పటిక బెల్లం, రోజ్ వాటర్ కలిపి అప్లై చేసిన ప్యాక్ మీదనే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత సర్కులర్ మోషన్ లో స్క్రబ్ చేస్తూ ప్యాక్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ప్ పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. పసుపు, పటిక బెల్లం, నిమ్మరసం, అవాంఛిత రోమాలు తొలగించడంలో బాగా పని చేస్తుంది.
Related News
Hirsutism: స్త్రీల ముఖంపై గడ్డం, మీసాలు కనిపించడానికి గల కారణాలివే..?
ప్రాచీ ముఖంపై మీసాలు కనిపించటంతోనే కొందరు నెటిజన్లు తనను ట్రోల్ చేశారని ప్రాచీ చెప్పింది. ఆమె ర్యాంకర్‌గా నిలిచిన విషయాన్ని పక్కనబెట్టి ఆమె మీసాలపై కామెంట్లు చేశారు.