Beauty Tips: మీ చర్మ సౌందర్యం మరింత రెట్టింపు కావాలంటే కాఫీ పొడితో ఇలా చేయాల్సిందే?
కాఫీ పొడి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మన నిత్యం కాఫీ పొడిని ఉపయోగిస్తూనే ఉంటాం. కాఫీ తాగడం వల్ల రిలాక
- By Anshu Published Date - 04:00 PM, Thu - 29 February 24

కాఫీ పొడి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మన నిత్యం కాఫీ పొడిని ఉపయోగిస్తూనే ఉంటాం. కాఫీ తాగడం వల్ల రిలాక్సింగ్ గా ఫ్రెష్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే కాఫీ పొడి కేవలం ఉత్సాహాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది అంటున్నారు నిపుణులు. మరి కాపీ పొడితో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాఫీ తాగడం వల్లే కాదు, కాఫీని ముఖానికి పూసుకోవడం ద్వారా కూడా అందాన్ని పెంచుకోవచ్చు. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయానికొస్తే..
టీ స్పూన్ తేనె, కాఫీ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఉంచి ముఖాన్ని కడుక్కుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల మరింత ఫ్రెష్‌గా కనిపిస్తారు. కొంచెం కాఫీ పౌడర్, పెరుగు, ఓట్‌మీల్ పౌడర్, తేనె కలిపి మెడకు, ముఖానికి రాసుకొని ఓ అరగంట పాటు ఉంచుకోవాలి. దీంతో మీ స్కిన్ మృదువుగా మారుతుంది. కాఫీని ఐస్‌క్యూబ్స్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు ఆ క్యూబ్స్ తీసుకుని ముఖంపై మర్దనా చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఫ్రెష్ లుక్ వస్తుంది.
కండిషనర్‌లో రెండు టీస్పూన్ల గ్రౌండ్ కాఫీని కలిపి జుట్టుకు పూసుకోవాలి. కొద్దిసేపు తర్వాత తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత మీరు ఏ స్టయిల్‌లో కావాలంటే ఆ స్టయిల్‌లో జుట్టు దువ్వుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, కాఫీ పౌడర్ మిక్స్‌ను ముఖానికి రాసుకొని ఓ పదినిమిషాల పాటు ఉంచి కడిగితే చర్మం పొడిబారదు. టీ స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం కోకో పౌడర్, తేనె కలిపిన ప్యాక్‌ను ముఖానికి రాసి తర్వాత చల్లని నీళ్లతో కడుక్కుంటే ముఖంపై పేరుకున్న మృతకణాలను తొలిగిపోతాయి.