Beard Style Vs Personality : ఒక్కో గడ్డం.. ఒక్కో సంకేతం.. ఒక్కో సందేశం..
పొడవు గడ్డం(Beard Style Vs Personality) ఉన్నవారు సాహసికులు, దైర్యవంతులు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.
- By Pasha Published Date - 10:49 AM, Sun - 30 March 25

Beard Style Vs Personality : గడ్డం.. మనిషి లుక్‌ను అమాంతం మార్చేయగలదు. గడ్డం స్టైల్‌ను బట్టి మనం ఎదుటి వారి వ్యక్తిత్వం, స్వభావాలపై ఒక అంచనాకు రావచ్చు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు తీరొక్క గడ్డాలను కలిగి ఉంటారు. ఇంతకీ ఏ రకం గడ్డం దేనికి సంకేతం ? స్టైల్‌ను బట్టి వివిధ రకాల గడ్డాలను చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి ? ఏ అంచనాకు రావాలి ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Ugadi 2025 : విశ్వావసు నామ సంవత్సరం వచ్చేసింది.. విశ్వావసు ఎవరు? కథేంటి ?
గడ్డంతో ఆరోగ్య ప్రయోజనాలు
చాలామంది గుబురు గడ్డాన్ని ఇష్టపడతారు. టెస్టోస్టిరాన్ లెవల్స్ అధికంగా ఉండే పురుషులకు గుబురు గడ్డం వస్తుందని అంటారు. దీని వల్ల సెక్స్ లైఫ్ బాగుంటుందని భావిస్తారు. గుబురు గడ్డం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. గుబురు గడ్డం వల్ల చర్మం పొడిబారదు. దీనివల్ల మొటిమలు, ఇన్ఫెక్షన్లు రావు. నల్ల మచ్చలు తగ్గుతాయి.
ఫ్రెంచ్ గడ్డం
గుండ్రటి ఆకారంలో పెదవుల పైభాగం, కింది భాగంలో మాత్రమే ఉండే దాన్ని ఫ్రెంచ్ గడ్డం అంటారు. ఈ గడ్డం ఉన్నవాళ్లను మనం నమ్మొచ్చు. వీరు ఏదైనా మాట ఇస్తే తప్పరు. ఏదైనా పనిని అప్పగిస్తే సమర్ధంగా పూర్తి చేస్తారు. వీరు తెలివిమంతులు. ఏ పనినైనా పరిపక్వతతో పూర్తి చేస్తారు. తమ చుట్టూ ఉన్నవారి సేఫ్టీని కోరుకుంటారు. ఏం చేస్తున్నారు ? దాని వల్ల ఏం జరుగుతుంది ? అనే క్లారిటీ ఫ్రెంచ్ గడ్డం వారికి ఉంటుంది. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు.. వీరు లెక్కలు వేసుకుంటారు. ఆ తర్వాతే దాన్ని మొదలుపెడతారు.
గొర్రె గడ్డం
మీసాలను పూర్తిగా తీసేసి.. కేవలం పెదవుల కింది భాగంలో పెంచే దాన్ని గొర్రె గడ్డం అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో గ్యుయెట్ గడ్డం అని పిలుస్తారు. ఇలాంటి వారికి మత విశ్వాసాలు ఎక్కువ. ఆచార, సంప్రదాయాలను తూ.చ తప్పకుండా గౌరవిస్తారు. పెద్దల మాటను జవదాటరు. తమ జీవితంలో కుటుంబానికి, సన్నిహితులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గొర్రె గడ్డం ఉన్న వారికి భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఎక్కువ. వీరు చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతారు. కోపం తొందరగా వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ సామర్థ్యం తక్కువ. జీవిత భాగస్వామి, పిల్లలను ప్రాణప్రదంగా భావిస్తారు.
Also Read :Ramzan 2025: సౌదీలో నేడే రంజాన్.. రేపు భారత్‌లో ఈద్
పొడవు గడ్డం
పొడవు గడ్డం(Beard Style Vs Personality) ఉన్నవారు సాహసికులు, దైర్యవంతులు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. పైకి కఠినంగా కనిపించినా.. వీరికి దయాగుణం ఎక్కువ. పరోపకారం చేసే విషయంలో పొడవు గడ్డం వారు ముందుంటారు. స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనివ్వరు. ఇతరులను నవ్వించడం, తాము నవ్వడం అంటే వీరికి ఇష్టం. పొడవు గడ్డం వారు హాస్య ప్రియులు. వీరు బిగ్గరగా నవ్వుతారు.
మొద్దు గడ్డం
మొద్దు గడ్డం.. దీన్ని ఇంగ్లిష్‌లో స్టబుల్ బేర్డ్ అని పిలుస్తారు. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. చాలాసార్లు ఆలోచించాకే ఒక నిర్ణయానికి వస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో చాలా సమయం ఆదా అవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగం .. ఇలా ప్రతీచోట వీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకొని విజయాలను సాధిస్తారు. ఎక్కడైనా తప్పు కనిపిస్తే వీరు నిస్సంకోచంగా విమర్శిస్తారు. ఎక్కడైనా మంచి కనిపిస్తే వెంటనే ప్రశంసిస్తారు. ఫ్యూచర్ ప్లాన్ వేయడంలో వీరు కింగ్ మేకర్స్. కష్టపడి పనిచేసే విషయంలో మొద్దు గడ్డం వారికి తిరుగుండదు. ఏదైనా అంశంపై రీసెర్చ్ చేయడంలో వీరు దిట్టలు.