Bathing: చలికాలంలో స్నానం చేయడం కష్టంగా ఉందా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
చాలామందికి ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయడం అలవాటు. ఇంకొందరు ప్రతిరోజు ఒకసారి స్నానం చేస్తే,
- By Nakshatra Published Date - 08:30 AM, Wed - 16 November 22
చాలామందికి ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయడం అలవాటు. ఇంకొందరు ప్రతిరోజు ఒకసారి స్నానం చేస్తే, మరికొందరు మాత్రం రోజు విడిచి రోజు స్నానం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో అయితే రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేయడానికి అయినా ఇష్టపడుతూ ఉంటారు. కానీ చలికాలం మొదలయ్యింది అంటే చాలు నడవడానికి లేవడానికి అలాగే స్నానం చేయడానికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. చలికాలం లో చాలామంది పొద్దున స్నానం చేయడానికి బదులు మధ్యాహ్నం చేద్దాంలే అని నాన్నని పోస్ట్ ఫోన్ చేసుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. ఆ చలికాలంలో స్నానం చేయాలి అంటే ఉదయం చేస్తాం సాయంత్రం చేస్తామంటూ స్థానం చేయడానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు.
మరి స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ గురించి తెలుసుకోవాల్సిందే. అయితే స్నానం చేయడం సరైనదా కాదా అంటే సరైనదే. ఎందుకంటే ప్రతిరోజు స్నానం చేయడం వల్ల మన శరీరంపై ఉంటే హానికరమైన బ్యాక్టీరియా వెళ్లిపోయి శరీరం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. రోజు స్నానం చేయడం వల్ల మీ చర్మం పొడిగా ఏర్పడి, పగుళ్లు ఏర్పడుతుంది, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి అలెర్జీ ప్రతిచర్యకు కారణమవుతుంది. అలాగే అతిగా స్నానం చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. స్నానం ఎక్కువగా చేసిన అలాగే శరీరాన్ని అతిగా శుభ్రం చేసుకున్న మానవ మైక్రో బియోమ్ దెబ్బతింటుంది.
మైక్రోబియోమ్ అంటే శరీరానికి అంటిపెట్టుకుని ఉండే సూక్ష్మ జీవులైన బ్యాక్టీరియా, వైరస్ల కలయిక. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. రెండు, అంతకంటే ఎక్కువసార్లు స్నానం చేసినా శరీరంలోని అతి సూక్ష్మజీవ వ్యవస్థ దెబ్బతిని రోగనిరోధక, జీర్ణ వ్యవస్థలకు నష్టం కలుగుతుంది. దీని వల్ల గుండెకు కూడా ముప్పేనని తెలిసింది. రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నందున పిల్లలు ఎక్కువగా స్నానం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చెమట, దుర్వాసన లేదా మురికిగా అనిపించకపోతే, మీరు స్నానం చేయవలసిన అవసరం లేదు. మూడు నుండి నాలుగు నిమిషాల కంటే ఎక్కువ స్నానం చేయవద్దు. అనేక సబ్బులు మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. మీకు అనారోగ్యం కలిగిస్తాయి.
Tags
Related News
Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ
Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కే