SpringRolls : ఇంట్లోనే బేకరీ స్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారుచేయండిలా..
ఇప్పుడొక గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తగినన్ని నీరు పోసుకుంటూ గంటెజారుడుగా పిండిని కలుపుకోవాలి. స్టవ్ మీద నాన్ స్టిక్ కళాయి పెట్టి వేడిచేయాలి.
- By News Desk Published Date - 04:40 AM, Sat - 4 November 23
స్ప్రింగ్ రోల్స్.. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లో లభిస్తాయి. పైన క్రిస్పీగా లోపల రుచికరమైన స్టఫ్ తో ఉండే ఈ రోల్స్.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. అయితే.. ప్రతీసారీ బేకరీ ఫుడ్ తినడం అంతమంచిది కాదు. అక్కడ ఉపయోగించే ఆయిల్ ఫ్రెష్ గా ఉండదు. అందుకే ఈవెనింగ్ స్నాక్ ఐటమ్ గా స్ప్రింగ్ రోల్స్ ను ఇంట్లోనేచాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావలసిన పదార్థాలు
మైదాపిండి – అరకప్పు
కార్న్ ఫ్లోర్ – పావుకప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా
స్టఫ్ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె – 1 టేబుల్ స్పూన్
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి -1
చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
తరిగిన బీన్స్ – పావుకప్పు
తరిగిన క్యారెట్ – పావుకప్పు
తరిగిన పొటాటో – అరకప్పు
తరిగిన టమాటో – 1
సన్నగా తరిగిన క్యాప్సికం – పావుకప్పు
పచ్చిబఠాణీ – పావుకప్పు
స్వీట్ కార్న్ – పావుకప్పు
పసుపు – పావు టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – అర టీ స్పూన్
చాట్ మసాలా – అర టీ స్పూన్
నీళ్లు – పావుకప్పు
స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం
ముందుగా స్టఫ్ కోసం కళాయిలో నూనె వేడి చేసి.. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్నాక.. కూరగాయముక్కలు, టమాటమాక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ముక్కలు మెత్తబడినతర్వాత కారం, ధనియాలపొడి, చాట్ మసాలా వేసి కలపాలి. తర్వాత నీళ్లుపోసి.. ఆ నీరంతా ఇగిరిపోయేంతవరకూ ఉడికించుకోవాలి. పప్పుగుత్తితో మెత్తగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడొక గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తగినన్ని నీరు పోసుకుంటూ గంటెజారుడుగా పిండిని కలుపుకోవాలి. స్టవ్ మీద నాన్ స్టిక్ కళాయి పెట్టి వేడిచేయాలి. అది కొద్దిగా వేడయ్యాక బ్రష్ తో పిండిని తీసుకుని కళాయిపై రాసుకోవాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా ఒక షీట్ లాగా పిండిని రాసుకోవాలి. ఈ పిండి కాలేకొద్దీ.. కళాయి నుంచి నెమ్మదిగా వేరవుతుంది. దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ఒక్కో షీట్ తీసి అందులో స్టఫింగ్ ను పెట్టుకోవాలి.
ఒకదానిపై ఒకటి పెట్టాక.. అంచులను లోపలికి మడిచి రోల్ చేయాలి. డీప్ ఫ్రై కి సరిపడా నూనెపోసి వేడిచేసి.. అందులో రోల్స్ వేసి వేయించాలి. రోల్స్ కాస్త ఎర్రగా వేగాక.. నూనెలో నుంచి తీసేయాలి. ఇలా చేస్తే.. క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ తయారవుతాయి. వీడని టమాటో కెచప్ తో తింటే.. అచ్చం బేకరీ టేస్టే ఉంటాయి.
Also Read : Raisins: ఎండు ద్రాక్ష ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరమే..!
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..