Drinking Water: మట్టి కుండల్లో నీటిని తాగడం వల్ల ఇన్ని హెల్త్ బెన్ ఫిట్స్ ఉన్నాయా
- Author : Balu J
Date : 28-03-2024 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
Drinking Water: ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాప చూపుతుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమ్మర్ ను బీట్ చేసేందుకు చల్లని నీటిని తాగుతున్నారు. అయితే చాలామంద మట్టి కుండల్లో నీటిని తాగడానికి ఇష్టపడుతున్నారు. ఫ్రిడ్జ్ కు బదులు మట్టికుండలోని నీరు మనకు అవసరమైనంత చల్లగా ఉండటంతోపాటు పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఈ నీరు తాగడం అత్యుత్తమం. కుండలో నీళ్ళు త్రాగితే అల్కలైన్ అనే పదార్ధం ఉంటుంది ఇది శరీరంలో అనవసరపు గ్యాస్ ని బయటకు తరిమేసి శరీరంలో మరియు పొట్టలోని చల్లదనం ఇస్తుంది.
కుండలోని నీరు సహజసిద్ధంగా చల్లబడుతుంది. అందుకే ఈ నీరు శరీరానికి హాని చేయదు. జలుబు దగ్గు గొంతు నొప్పి ఇవేం రావు. అలాగే చల్లగా నిరు కూడా త్రాగిన తృప్తి ఉంటుంది. జలుబు,దగ్గు మరియు గొంతు నొప్పి ఫ్రిడ్జ్ లో నీళ్ళు త్రాగగానే వెంటనే జలుబు వచ్చేస్తుంది, కాని కుండ లోని నిరు త్రాగితే ఎంతో చల్లగా మరియు దాహం తీరుతుంది. ఫ్రిజ్లోని నీరు తాగడంతో వచ్చే గొంతు సమస్యలు కుండలోని నీటితో తలెత్తవు. చల్లటి ఫ్రిజ్ నీరు తాగితే గొంతు సమస్యలు, జలుబు రావటానికి అవకాశం ఉంది. పిల్లలకి, పెద్దలకి వడదెబ్బ నుండి రక్షణ ఇస్తుంది. ఇది మట్టి తో చెయ్యడం వల్ల దానిలో ఎంతో చలవ చేసే పదార్ధం ఉంటుంది. వడదెబ్బ నుండి రక్షణ ఇస్తుంది.
అలాగే శరీరం వేడి ఎక్కకుండా ఉస్తోగ్రత పెంచకుండా ఉంటుంది. ఫ్రిజ్లోని నీటి కన్నా కుండలోని నీరు ఆరోగ్యదాయకం. ఇది శరీర ఉష్ణోగ్రతను తగిన స్థాయిలో నిలిపివుంచుతుంది. సహజ శుద్ధిమట్టి కుండలు నీటిని చల్లబరచడానికి మాత్రమే కాకుండా సహజంగా శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి.