Chepala Pulusu: ఆంధ్రస్టైల్ చేపల పులుసు.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని మరి తినేయాల్సిందే?
చేపల పులుసు.. ఈ పేరు వినగానే చాలామందికి నోరూరిపోతూ ఉంటుంది. అయితే ఈ చేపల పులుసును ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు.
- By Nakshatra Published Date - 11:15 PM, Wed - 20 March 24
చేపల పులుసు.. ఈ పేరు వినగానే చాలామందికి నోరూరిపోతూ ఉంటుంది. అయితే ఈ చేపల పులుసును ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఆంధ్రాలో ఒక విధంగా తెలంగాణలో ఒక విధంగా అలాగే కేరళ సైడ్ ఒక లాగా ఇలా ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఆంధ్ర స్టైల్ లో చేపల పులుసును ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
చేపలు – కిలో
ఉల్లిపాయలు – రెండు
టమోటాలు – రెండు
పచ్చి మిర్చి – మూడు
చింతపండు – చిన్న ఉండ
కారం – రెండు స్పూనులు
అల్లం వెల్లుల్లి పేస్టు – మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – ఒక కట్ట
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
పసుపు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
నూనె – అర కప్పు
నీళ్లు – తగినన్ని
తయారీ విధానం
ముందుగా చేప ముక్కలు శుభ్రంగా నీటితో కడిగాక ఉప్పు, పసుపు పట్టించి కాసేపు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల చేపల నుంచి వచ్చే పచ్చి వాసన తగ్గుతుంది. ఇప్పుడు చింతపండును గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవచ్చు లేదా మెత్తగా పేస్టు చేసుకోవచ్చు. టమోటా ప్యూరీని కూడా తీసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఉల్లిపాయల తరుగు లేదా ఉల్లిపాయల ముద్ద వేసి వేయించాలి. అవి కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ వేయాలి. నిలువుగా తరుక్కున్న పచ్చిమిర్చి, పసుపు వేసి కలపాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి వేయించాలి. అన్నీ పచ్చి వాసన పోయేదాకా వేయించి చింతపండు రసాన్ని వేయాలి. మీకెంత పులుసు కావాలనుకుంటున్నారో అన్ని నీళ్లు కూడా వేయాలి. రసం సలసల కాగుతూ బుడగలు వస్తున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకులు వేయాలి. ఇప్పుడు ముందుగా మారినేషన్ చేసుకున్న చేపముక్కలని వేయాలి. రసం బాగా వేడెక్కి ఉంది కనుక చేపలు కేవలం 20 నిమిషాల్లో ఉడికేస్తాయి. చేపలు ఎక్కువగా గరిటెతో కలపకూడదు. ముక్కలుగా విడిపోతాయి. అంతే చివరగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ.
Related News
Andhra Chepala Pulusu: ఆంధ్రస్టైల్ చేపల పులుసు.. ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
మాములుగా మనం చేపలతో చేపల పులుసు, చేపల కర్రీ, చేప కబాబ్ చేప ఫ్రై, చేపల మసాలా కర్రీ ఇలా ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. అయితే ఎప్పుడు