Beauty Tips: చర్మ సౌందర్యం కోసం ఏడు టిప్స్.. అవేంటంటే?
స్త్రీ,పురుషులు చర్మాని చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి మహిళా కూడా అందమైన స్వచ్ఛమైన చర్మ స
- By Nakshatra Published Date - 09:50 PM, Tue - 11 July 23
స్త్రీ,పురుషులు చర్మాని చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి మహిళా కూడా అందమైన స్వచ్ఛమైన చర్మ సౌందర్యాన్ని కోరుతూ ఉంటుంది. పురుషులతో పోల్చుకుంటే మహిళలు చర్మ సౌందర్యం పై ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ హోం రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొందరు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో చర్మ సమస్యల బారీన పడుతుంటారు. ఈ చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు, చిట్కాలను అనుసరించి ఉంటారు. అయితే చర్మ సౌందర్యం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈజీగా మీ చర్మ అందాన్ని కాపాడుకోవచ్చు.
అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది నిద్రపోయేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించరు. మీ చర్మం సున్నితంగా ఉండాలన్నా అలాగే ముడతలు పడకుండా ఉండాలన్నా మీరు నిద్రపోయేటప్పుడు స్ట్రెయిట్ గా పడుకోండి. మనం ఒకే పొజిషన్ లో నిద్రపోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. మీరు బోర్లా పడుకొని నిద్రపోయినా ముఖాన్ని దిండుకేసి నొక్కుతూ పడుకునే అలవాటున్నా ముఖంపై మడతలు పడతాయి. చర్మం సాగిపోతోంది. రెడ్ వైన్.. వైన్ లో ఉండే ద్రాక్ష పళ్లలో ఉండే ఫ్లవనాయిడ్స్ అనే రసాయనం కణాల విధ్వంసం కాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫమేటరి ఏజెంట్స్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ వల్ల చర్మం ప్రకాశంగా మారుతుంది. అయితే దీన్ని లిమిట్ లోనే తీసుకోవాలి.
ఓవర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చేపలను తినడం వల్ల మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. చేపల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యం అవుతాయి. వీటిని తినడం ద్వారా చర్మం మరింత నిగనిగలాడుతుంది. అదేవిధంగా సూర్యకిరణాల్లో హాని చేసే యూవి-బి కిరణాల నుంచి కూడా విటమిన్ సి వల్ల రక్షణ పొందవచ్చు. అయితే సూర్మరశ్మి శరీరానికి అవసరమైనంత తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగని ఎక్కువగా ఎండలో వుంటే చర్మం నల్లబడి పోతుంది. ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం వల్ల నిర్జీవమైన చర్మాన్ని తొలగించుకోవచ్చు. వారంలో రెండు మూడు సార్లు స్ర్కబ్బింగ్ తో ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి.
పొడిబారి, జిడ్డు చర్మ తత్వం కలవారికి మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది. శరీరంలో హైడ్రేషన్ వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. అందుకు తగినంత నీరు త్రాగడం, మాయిశ్చరైజింగ్ క్రీముల ద్వారా, ఆయిల్ మసాజ్ ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ముఖానికి స్టీమింగ్ చేయడం చాలా మంచిది. స్టీమింగ్ వల్ల చర్మంలో ఉన్న మలినాలు, దుమ్ము, దూళి తొలగిపోయి, చర్మరంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మ గ్రంధులను శుభ్రపరుస్తుంది. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్ల రూపంలో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త