Beauty Tips: ఈ ఐదు చిట్కాలు పాటిస్తే చాలు.. మేకప్ కూడా అవసరం లేదు?
ఈ రోజుల్లో చాలామంది అందంగా కనిపించడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడంతోపాటు రకరకాల సోపులు క్రీమ్ లను ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొ
- By Nakshatra Published Date - 10:30 PM, Mon - 3 July 23
ఈ రోజుల్లో చాలామంది అందంగా కనిపించడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడంతోపాటు రకరకాల సోపులు క్రీమ్ లను ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఫేస్ పై ఉన్న ముడతలను పింపుల్స్ ని కవర్ చేసుకోవడం కోసం ఓవర్ గా మేకప్ చేసుకుంటూ ఉంటారు. అయితే మేకప్ లేకపోయినా కూడా ముం మెరిసిపోవాలి అంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే.. అందమైన, కాంతివంతమైన చర్మ కోసం ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అది లోపల నుంచి వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది. సౌందర్య ఉత్పత్తుల వల్ల కూడా చర్మం కాంతివంతంగా ఉంటుంది. అయితే ఆ సౌందర్య ఉత్పత్తులు వాడటం ఆపేసిన వెంటనే మళ్లీ చర్మం ముందు స్థితి కంటే మరింత భయంకరంగా తయారవుతుంది.
అయితే చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యాంగా కాంతివంతంగా ఉండాలంటే మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అందమైన చర్మం కోసం అనేక మంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లను ఆశ్రయిస్తారు. అయితే చర్మ సౌందర్యం అనేది సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడి ఉండదు. చర్మ ఆరోగ్యానికి మీ ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ముఖ్యం. ఆరోగ్యవంతమైన చర్మం కోసం ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండి, వీలైనంత శుభ్రంగా ఉండే ఆహారం తినండి. యాంటీఆక్సిడెంట్ కొల్లాజెన్ స్థాయిలు అధికంగా ఉండటానికి తాజా పండ్లు, కూరగాయలు డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ చాల ముఖ్యం. ఎండ ప్రభావం చర్మంపైన ఎక్కువగా ప్రసరిస్తుంది. అందువల్ల, వేసవిలో చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, సవహించాలి. ఎండల వేడి చర్మం మీద ప్రసరించినప్పుడు చర్మం కందిపోయి నల్లగవడం, నల్లమచ్చలు రావడం, చర్మానికి ముడతలు ఏర్పడటం లాంటి సమస్యలు కలుగుతాయి. సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి రాయడం వల్ల, ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ముఖం మీదే కాకుండా, ఎండతగిలే భాగాలకూ రాయాలి. మీ చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి.. చర్మాన్ని హైడ్రేషన్‌గా ఉంచటం చాలా మంచిది. ఈ విషయంలో మిగతా శరీరానికి చర్మానికి తేడా లేదు. నీళ్లు తాగటం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. నీరు చర్మంలోని మలినాలను తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది. రోజుకి రెండు లీటర్ల నీరు తాగితే చర్మం బిగుతుగా, మృదువుగా, నునుపుగా తయారవుతుంది. చర్మం హైడ్రేట్ గా ఉంటే కాంతివంతంగా తయారవుతుంది. మరి ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి అన్న విషయానికి వస్తే.. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా హానికరం. వయస్సులో ఉన్నప్పుడు మీ చర్మం అందంగా కనిపించాలనుకుంటే, చెడు అలవాట్లను విడిచి పెట్టండి. మద్యం, ధూమపానం చర్మం వృద్దాప్యం అయ్యేందుకు రెండు ప్రధాన కారణాలు. పొగాకు వల్ల చర్మంలో రక్త ప్రవాహం తగ్గడంవల్ల ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ. అదేవిదంగా మద్యపానం అతిగా తాగే వారిలో చర్మం పొడిబారుతుంది.
Tags
Related News
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.