Bihar Assembly : నువ్వో పిల్ల బచ్చగాడివి అంటూ తేజస్వియాదవ్ పై నితీష్ ఆగ్రహం
Bihar Assembly : నితీష్ కుమార్ తేజస్విని లక్ష్యంగా "నువ్వో బచ్చా గాడివి.. నీకేం తెలుసు?" అంటూ తీవ్రంగా మండిపడ్డారు
- By Sudheer Published Date - 03:39 PM, Wed - 23 July 25

బీహార్ అసెంబ్లీ సమావేశాలు (Bihar Assembly) ఈసారి తీవ్రమైన రాజకీయ ఉద్వేగాలకు వేదికవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ (Nithish – Tejashwi Yadav) మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద దుమారాన్నే రేపింది. ఓటర్ల జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో తేజస్వి తీవ్ర విమర్శలు చేస్తే, సీఎం నితీష్ దీన్ని సమర్థిస్తూ బలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. నితీష్ కుమార్ తేజస్విని లక్ష్యంగా “నువ్వో బచ్చా గాడివి.. నీకేం తెలుసు?” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలంటే ఎన్నికల సంఘం 11 రకాల డాక్యుమెంట్లు కోరుతోందని ఆరోపించారు. పేదలు, నిరక్షరాష్యులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇవన్ని కేవలం 25 రోజుల్లో సిద్ధం చేయడం అసాధ్యం అని చెప్పారు. ఈ విధానం వల్ల పేదలు ఎన్నికల ప్రక్రియ నుంచి దూరమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి సమానంగా ఉండాలని, ఈ విధానం అన్యాయంగా మారుతోందని విమర్శించారు.
Attack : తండ్రి అనే పదానికి మచ్చ తెచ్చిన నీచుడు..కన్న కూతురుపై శాడిజం
దీనిపై తీవ్రంగా స్పందించిన నితీష్ కుమార్ తేజస్విపై వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడ్డారు. “నువ్వు చిన్నపిల్లవాడివి, నీ తల్లిదండ్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? పాట్నాలో సాయంత్రం బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. మా ప్రభుత్వం మహిళల కోసం, ముస్లింల కోసం ఎంతో చేసింది. కానీ మీరు (ఆర్జేడీ) ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించకండి” అంటూ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తేజస్వి వినిపించిన ప్రజల సమస్యల పట్ల స్పందించాల్సిన చోట నితీష్ వ్యక్తిగత దాడులకు దిగడం విమర్శలకుల కారణమవుతోంది. ఇది 2025 ఎన్నికల దృష్ట్యా నితీష్-తేజస్వి మధ్య కొనసాగబోయే రాజకీయ పోరుకు నాంది కావచ్చుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాథమిక హక్కుల విషయంలో సమస్యలు పరిష్కరించాల్సిన సమయం ఇదని విశ్లేషకులు సూచిస్తున్నారు.