Credit Card: క్రెడిట్ కార్డులతో అలాంటి కొనుగోలు చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త?
సాధారణంగా ఖరీదైన క్రెడిట్‌కార్డు కొనుగోళ్లను సులభ వాయిదాలతో ఈఎంఐ ల కిందకు మార్చుకోవడం వల్ల
- By Nakshatra Published Date - 09:15 AM, Sat - 16 July 22
సాధారణంగా ఖరీదైన క్రెడిట్‌కార్డు కొనుగోళ్లను సులభ వాయిదాలతో ఈఎంఐ ల కిందకు మార్చుకోవడం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు మొత్తాన్ని లేదా కొన్ని కొనుగోళ్లను ఈఎంఐ లుగా మార్చుకునే వెసులుబాటు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంత పరిమితి దాటిన కొనుగోళ్లను ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. తక్కువ వడ్డీరేటుతో కావాల్సిన గడవులోగా తీర్చే అవకాశం కూడా ఉండడంతో చాలా మంది ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటుంటారు.
అయితే కొంత మంది క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లోనూ దాన్ని వాయిదాల కిందకు మార్చేసుకుంటుంటారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ప్రయాణ ఖర్చులు, దుస్తులు, లైఫ్‌స్టైల్, బీమా ఇలా ఎలాంటి ఖర్చులనైనా ఈఎంఐ కిందకు మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ వసతిని ఉపయోగించుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం క్రెడిట్ కార్డు కొనుగోళ్లను ఈఎంఐ కిందకు మార్చుకోలేరట. మరి ఆ కొన్ని సందర్భాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు ద్వారా చేసిన బంగారం, ఇతర ఆభరణాల కొనుగోళ్లను ఈఎంఐగా మార్చొద్దని బ్యాంకులు సహా ఇతర క్రెడిట్‌కార్డు జారీదారులకు ఆర్బీఐ 2013లోనే ఆదేశించింది.
బంగారం రిటైల్ కొనుగోళ్లను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2018 లో మరోసారి ఆర్బీఐ ఈ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఆభరణాల చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లో ఈఎంఐగా మార్చొద్దని తేల్చి చెప్పేసింది. అదేవిధంగా కొన్ని బ్యాంకులు పాత కొనుగోళ్లు అనగా వస్తువు కొని ఓ నిర్దిష్టకాలం గడిచిన తర్వాత వాటిని ఈఎంఐ కిందకు మార్చుకోవడానికి అనుమతించడం లేదు. అలాగే క్రెడిట్ కార్డు తో చేసే ఇంధన చెల్లింపులు, నగదు లావాదేవీలను సైతం ఈఎంఐగా మార్చుకునేందుకు కొన్ని బ్యాంకులు అనుమతించడం లేదు.
Related News
China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?
చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్‌ను కొనేస్తోంది.