10th Pass Jobs : పదో తరగతి పాసైన వారికి ‘యంత్ర’ ఫ్యాక్టరీలో 3883 జాబ్స్
కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్ విభాగంలో(10th Pass Jobs) ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
- By Pasha Published Date - 03:26 PM, Mon - 28 October 24

10th Pass Jobs : పదోతరగతిలో పాసైన వారికి, ఐటీఐ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం పొందే ఛాన్స్. మొత్తం 3883 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. వాటిలో 2498 ఐటీఐ పోస్టులు, 1385 నాన్ ఐటీఐ పోస్టులు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసైన వారు నాన్ ఐటీఐ పోస్టులకు అప్లై చేయొచ్చు. మ్యాథ్స్, సైన్స్‌లలో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇక ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ గుర్తింపు కలిగిన సంస్థ నిర్వహించిన ట్రేడ్ టెస్ట్‌లో పాసైన వారు ఐటీఐ పోస్టులకు అప్లై చేయొచ్చు. కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్ విభాగంలో(10th Pass Jobs) ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
- 14 నుంచి 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఐటీఐ, నాన్ ఐటీఐ పోస్టులకు అప్లై చేయొచ్చు.
- కొన్ని సామాజిక వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి. దీన్నిబట్టి టెన్త్ పాసై, కాస్త టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వారికి ఇది మంచి అవకాశం.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.200. మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు రూ.100.
- యంత్ర ఇండియా లిమిటెడ్ వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
- అభ్యర్థులు ఫొటో, సిగ్నేచర్, ఐడీ ప్రూఫ్, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి.
- పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా నాన్ ఐటీఐ జాబ్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఐటీఐ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- అప్లై చేయడానికి లాస్డ్ డేట్ నవంబరు 21.
- యంత్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే.. ఇందులో ఆయుధాలు, పేలుడు సామగ్రిని, వాటికి సంబంధించిన ముడి పదార్థాలను తయారు చేస్తుంటారు.