Murder: మద్యం మత్తులో ఉన్న భర్తను చంపేసిన భార్య.. ఎవరో చంపి పారిపోయారంటూ ఇంటి బయటికొచ్చి కేకలు!!
యూపీలోని బారాబంకిలో (Uttar Pradesh) (Barabanki) మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది.
- By Hashtag U Published Date - 12:27 PM, Mon - 19 December 22

యూపీలోని బారాబంకిలో (Uttar Pradesh) (Barabanki) మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. అనంతరం దీనిపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. ఇంటి నుంచి బయటకు వచ్చి తన భర్తను ఎవరో హత్య చేసి పారిపోయారని కేకలు వేయడం ప్రారంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
బారాబంకి జిల్లాలోని పీర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నివాసముంటున్న రామ్ ఔసన్ రావత్ కుమారుడు వినయ్ రాజ్ (28 సంవత్సరాలు) ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. రాత్రి బంధువులతో కలిసి వినయ్ రాజ్ మద్యం సేవించి భోజనం చేసిన తర్వాత.. భార్యతో ఏదో విషయమై వాగ్వాదానికి దిగాడు.దీంతో మద్యం మత్తులో ఉన్న వినయ్‌రాజ్ తలపై కత్తితో
భార్య రాధ దాడి చేసి హత్యకు పాల్పడింది.
నేరం చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి.. తాను టాయి లెట్ కు వెళ్లి వచ్చేలోపు తన భర్తను ఎవరో చంపేశారని కేకలు వేయడం ప్రారంభించింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మహిళ బట్టలు కూడా రక్తంతో తడిసి ఉన్నాయి. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు కఠినంగా ప్రశ్నించారు. దీంతో నిజాన్ని అంగీకరించింది. అనంతరం పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హృదయ విదారకమైన హత్య కథను చెప్పిన వినయ్ తల్లి
మరోవైపు వినయ్ తల్లి ఇలా చెబుతోంది..‘‘వినయ్ భార్య బావ, కోడలు, ఇతర వ్యక్తులు రాత్రి మద్యం సేవించారు.. ఆ తర్వాత భోజనం చేసి బంధువులు అందరూ వినయ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు నుంచే రోజూ కొడుకు(వినయ్), కోడలు(రాధ) మధ్య గొడవలు జరుగుతుండేవి. హత్య తర్వాత రాధ తన భర్తను ఎవరో చంపి పారిపోయారని కేకలు వేసిందని వినయ్ తల్లి ఆరోపించింది. ఇక వినయ్ సోదరుడు విజయ్ తరఫున హత్య కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులు, బంధువులను విచారిస్తున్నామని చెప్పారు.