Priyanka Gandhi : ప్రియాంకాగాంధీ యూపీ బాధ్యతలు అవినాష్ పాండేకు.. ఎవరాయన ?
Priyanka Gandhi : 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేసింది.
- By Pasha Published Date - 01:10 PM, Sun - 24 December 23

Priyanka Gandhi : 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేసింది. దీనిపై శనివారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈక్రమంలోనే పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జులను నియమించింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా వ్యవహరించిన ప్రియాంకాగాంధీ స్థానంలో అవినాష్ పాండేను నియమించారు. ఈనేపథ్యంలో అవినాష్ పాండే ఎవరు ? ప్రియాంకాగాంధీకి(Priyanka Gandhi) ప్రత్యామ్నాయంగా ఆయనను కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చూసింది ? అనే దానిపై చర్చ మొదలైంది.
We’re now on WhatsApp. Click to Join.
అవినాష్ పాండే ఎవరు?
అవినాష్ పాండే ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇకపై ఆయనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా వ్యవహరించనున్నారు. ఈ పదవిని ఆయన కట్టబెడుతూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రియాంకాగాంధీ నిర్వర్తించిన బాధ్యతలను ఇక అవినాష్ పాండే చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లో నెలకొల్పిన రాజకీయ సంప్రదాయాలను అనుసరిస్తూ పనిచేస్తాను. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను” అని వెల్లడించారు.
- అవినాష్ పాండే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వాస్తవ్యుడు.
- అవినాష్ పాండే వృత్తిరీత్యా న్యాయవాది.
- అవినాష్ పాండే 2008లో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక ఓటు తేడాతో ఓడిపోయారు.
- రెండేళ్ల తర్వాత 2010లో మహారాష్ట్ర నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
- మహారాష్ట్ర ఎమ్మెల్సీగా, రాష్ట్రంలోని అనేక అడ్మినిస్ట్రేటివ్ కమిటీలలోనూ పాండే పనిచేశారు.
- 2018 అసెంబ్లీ ఎన్నికలలో రాజస్థాన్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా పాండే నియమితులయ్యారు.
- 2022 జనవరిలో జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన అనుభవం అవినాష్‌కు ఉంది.
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడా అవినాష్ ఉన్నారు.