పాన్ కార్డు ఉపయోగిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే రూ.10 వేలు ఫైన్
చెప్పవచ్చు. ఆధార్, పాన్ కార్డు లేనిది చాలా పనులు జరగవు. ఉద్యోగులతో పాటు బ్యాంకు సేవలు పొందే ప్రతిఒక్కరికీ పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం అనే విషయం తెలిసిందే.
- By Nakshatra Published Date - 07:42 PM, Tue - 20 December 22
చెప్పవచ్చు. ఆధార్, పాన్ కార్డు లేనిది చాలా పనులు జరగవు. ఉద్యోగులతో పాటు బ్యాంకు సేవలు పొందే ప్రతిఒక్కరికీ పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం అనే విషయం తెలిసిందే. కొన్ని రకాల సేవలకు ఆధార్ కార్డు అందుబాటులో లేనప్పుడు పాన్ కార్డును సమర్పించవచ్చు.
బ్యాంకులో రూ.50 వేలకుపైగా నగదు విత్ డ్రా చేసుకోవాలన్నా.. ఉద్యోగస్తులు తమ శాలరీ పొందాలన్నా.. ఇలా ఆర్ధిక పరమైన చాలా విషయాకు పాన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. లోన్ యాప్స్‌లలో లోన్లు తీసుకోవాలన్నా పాన్ కార్డు అనేది తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే పాన్ కార్డును ఎలా పడితే అలా వాడితే ఇబ్బందులు తప్పవు. తెలియని వెబ్ సైట్, యాప్స్ లలో అప్ లోడ్ చేస్తే మీకు పాన్ కార్డును దుర్వినియోగం చేయవచ్చు. అందుకే పాన్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పాన్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రూ.10 వేలు జరిమానా విధించే అవకాశముంది. పాన్ కార్డు పొందటానికి తప్పుడు సమాచారం ఇవ్వడం, రెండు కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరానికి పాల్పడినవారికి రూ.10 వేల జరిమానా విధిస్తారు. అలాగే ఐటీ చట్టంలోని 1981లోని సెక్షన్ 272బీ ప్రకారం పాన్ వివరాలు తప్పుగా ఇవ్వడం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి రూ.10 వేల ఫైన్ విధిస్తారు. ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి, ఇతర పనులకు పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన చోట పాన్ నెంబర్ కరెక్ట్ గా ఇవ్వాలి.
పాన్ నెంబర్ తప్పుగా ఇవ్వకుండా రెండు,మూడు సార్లు చెక్ చేసుకోవాలి. తప్పుగా ఇస్తే జరినామా కట్టాల్సి వస్తుంది. పాన్ కార్డు నెంబర్ లో మొదటి ఐదు ఇంగ్లీష్ ఆక్షరలు, ఆ తర్వాత నాలుగు నెంబర్లు, చివరి ఆక్షరం మళ్లీ ఇంగ్లీష్ ఆక్షరం ఉంటుంది. ఎక్కువమంది సున్నా, ఓ ఉన్న చోట పొరపాటు పడి తప్పుగా వివరాలు ఇస్తూ ఉంటారు. ఇక రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నవారు ఒకదాన్ని వెనక్కి ఇచ్చేయండి. మీ దగ్గర రెండు పాన్ కార్డులు ఉన్నాయని తేలితో జరిమానా వేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్లను పూర్తిగా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.
Related News
Duplicate PAN Card: మీ పాన్ కార్డ్ పోయిందా..? నిమిషాల్లో డూప్లికేట్ పాన్ కార్డ్ తయారు చేసుకోండిలా..!
పాన్ కార్డ్ మీ ఆర్థిక స్థితి గురించి చెబుతుంది. ఇది లావాదేవీ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.