Uttar Pradesh : సామాన్య వ్యక్తి ఫై చెప్పుతో దాడి చేసిన కానిస్టేబుల్
ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ..మద్యం తాగుతున్న వ్యక్తిపై రెచ్చిపోయాడు.
- By Sudheer Published Date - 11:01 AM, Mon - 24 July 23

బిజెపి పాలిత ప్రాంతాలలో మతం ముసుగులో దళితులపై , సామాన్య ప్రజలపై దాడులు ఎక్కువై పోతున్నాయి. గత రెండు నెలలుగా మణిపూర్ లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలు చూస్తూ యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు సైతం బిజెపి ఫై నిప్పులు చెరుగుతున్నారు.
బిజెపి పార్టీ ఓ మతాన్ని ప్రోత్సహిస్తూ..మిగతా మతాలను చిన్న చూపు చూడడం వల్లే కొంతమంది రెచ్చిపోతూ దారుణాలకు ఒడిగడుతున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం మణిపూర్ ఘటనలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా..తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని హర్దోయ్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ..మద్యం తాగుతున్న వ్యక్తిపై రెచ్చిపోయాడు. ఏకంగా 61 సార్లు అతడిని చెప్పుతో(Shoe) కొట్టిన ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ..
హర్దోయ్ జిల్లాలోని ఓ మార్కెట్ లో మద్యం తాగిన మైకంలో ఓ వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. అదే సమయంలో దినేశ్ ఆత్రీ (Dinesh Atri) అనే కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో మార్కెట్‌కు వెళ్లారు. తాగిన మైకంలో ఉన్న వ్యక్తి (Drunk Man).. మహిళతో సహా పలువురిని ఇబ్బంది పెడుతూ కనిపించాడు. దీంతో దినేశ్ ..అతడిని వారించేందుకు ప్రయత్నించగా వారిద్దమధ్య వాగ్వాదం మొదలైంది. కానిస్టేబుల్‌తో కూడా ఆ వ్యక్తి ఇష్టారీతిన వ్యవహరించడంతో కానిస్టేబుల్ అతడిపై చెప్పుతో ఇష్టపూర్తిగా కొట్టాడు. ఈ ఘటనను కొంతమంది ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన పోలీస్ అధికారుల వరకు వెళ్లడం తో..అధికారులు దినేష్ ను సస్పెండ్ చేసారు. స్థానికులు మాత్రం కానిస్టేబుల్ దినేశ్ దే తప్పు అన్నట్లు చెప్పడం జరిగింది.
Read Also : Stop Eating Tomatoes : టమాటాలు తినడం మానేయమంటున్న బీజేపీ మంత్రి..