Mahua Expelled : ఎంపీ మహువాపై లోక్‌సభ బహిష్కరణ వేటు
ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగిన వ్యవహారంలో మహువా మొయిత్రా (MP Mahua Moitra)ను పార్లమెంటు ఎథిక్స్ కమిటీ రెండువారాల క్రితమే దోషిగా నిర్ధారించింది.
- Author : Pasha
Date : 08-12-2023 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
Mahua Expelled : ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా (MP Mahua Moitra)పై లోక్‌సభలో వేటుపడింది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సుపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి లోక్‌సభ ఆమోదం తెలపడంతో.. ఎంపీ మహువా మొయిత్రా (MP Mahua Moitra)పై సభా బహిష్కరణ వేటుపడింది.
We’re now on WhatsApp. Click to Join.
ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగిన వ్యవహారంలో మహువా మొయిత్రా (MP Mahua Moitra)ను పార్లమెంటు ఎథిక్స్ కమిటీ రెండువారాల క్రితమే దోషిగా నిర్ధారించింది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఆ నివేదిక ప్రకారమే ఇప్పుడు ఆమెను సభ నుంచి బహిష్కరించారు. అయితే మహువా బహిష్కరణకు సంబంధించి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అధ్యయనం చేసేందుకు 48 గంటలు టైం ఇవ్వాలన్న టీఎంసీ ఎంపీల వాదనను అధికార బీజేపీ వినిపించుకోలేదు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సిఫారసును లోక్‌సభలో వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, సుదీప్ బందోపాధ్యాయ, జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్ ఉన్నారు. ఎథిక్స్ కమిటీ సిఫార్సుకు బీజేపీ ఎంపీలు డాక్టర్ హీనా వి గవిత్, అపరాజిత సారంగి మద్దతు తెలిపారు.
Also Read: 650 KG Ghee : అయోధ్య రామాలయం కోసం జైపూర్ నెయ్యి.. థాయ్‌లాండ్ మట్టి.. కంబోడియా పసుపు
లోక్‌సభ నుంచి బహిష్కరణ తర్వాత మహువా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎథిక్స్ కమిటీ రుజువులు లేకున్నా నాపై చర్యలు తీసుకుంది. నా నోరును మూసినంత మాత్రాన అదానీ గురించి లోక్‌సభలో చర్చే జరగదని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఒక లోక్‌సభ ఎంపీని బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చూపిన తొందరపాటు వైఖరి అనేది.. దానికి అదానీ ఎంత ముఖ్యమనే విషయాన్ని ప్రపంచానికి చూపించింది’’ అని (Mahua Expelled) తెలిపారు.