Three Died: హర్యానాలో విషాదం.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి
హర్యానాలోని హిస్సార్ (hisar)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. హిస్సార్(hisar) జిల్లాలోని నార్నాండ్ సబ్ డివిజన్‌లోని కప్రో గ్రామంలో డ్రైనేజ్ పైపులు బిగించే సమయంలో.. బురద కారణంగా బీహార్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు
- By Gopichand Published Date - 09:01 AM, Fri - 23 December 22

హర్యానాలోని హిస్సార్ (hisar)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. హిస్సార్(hisar) జిల్లాలోని నార్నాండ్ సబ్ డివిజన్‌లోని కప్రో గ్రామంలో డ్రైనేజ్ పైపులు బిగించే సమయంలో.. బురద కారణంగా బీహార్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు గురువారం మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కప్డో గ్రామంలో నిర్మిస్తున్న కొత్త సీవరేజీ లైన్‌లో పెద్దఎత్తున మట్టి పడి ముగ్గురు కూలీలు సమాధి అయ్యారు.
జేసీబీ, గ్రామస్తుల సాయంతో ముగ్గురినీ మట్టిలోంచి బయటకు తీసి నార్నూండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమాచారం మేరకు కప్డో గ్రామంలో కొత్త సీవరేజీ లైన్ వేసే పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెద్ద సంఖ్యలో కూలీలు పని చేస్తుంటారు. బీహార్‌కు చెందిన సంతోష్ మాంఝీ (38), సనోజ్ మాంఝీ (40), బల్జీత్ (35) సాయంత్రం 5 గంటల సమయంలో మూడు పైపులను అమర్చిన తర్వాత లైన్ నుండి బయటకు రావడం ప్రారంభించారు. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో మట్టి వారిపై పడింది.అక్కడికక్కడే బురదలో కూరుకుపోయారు.
Also Road: Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు తీవ్రవాదుల అరెస్ట్
విషయం తెలుసుకున్న మిగిలిన కూలీలు, గ్రామస్తులు గుమిగూడారు. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ, గ్రామస్తుల సాయంతో పావుగంట తర్వాత ముగ్గురిని బయటకు తీసి నార్నూదులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులు ముగ్గురూ బీహార్‌లోని ఖగారియా జిల్లా వాసులు.