Harbhajan Singh : ఇది మహిళా లోకంపై జరిగిన దాడి..దీదీకి హర్బజన్ సింగ్ లేఖ
రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నా..హర్బజన్ సింగ్ లేఖ
- Author : Latha Suma
Date : 18-08-2024 - 6:23 IST
Published By : Hashtagu Telugu Desk
Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన స్పందించారు. దేశాన్ని కుదిపేస్తోంది. ఈ దారుణం జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ..విచారణ వేగవంతం కాకపోవడాన్ని భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ప్రశ్నించారు. నేరస్థుడికి త్వరగా శిక్ష పడితే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి లేఖ రాశారు.
We’re now on WhatsApp. Click to Join.
బెంగాల్ ఘటన దేశాన్ని కదిలించింది. ఇది కేవలం ఒకరిపై జరిగిన దాడి కాదు.. సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతపై జరిగిన దాడి. వ్యవస్థలో పాతుకుపోయిన పురుష అహంకారాన్ని కళ్లకు కడుతోంది. వ్యవస్థలో మార్పులు, అధికారుల తక్షణ చర్యల ఆవశ్యకతను చాటుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించే ప్రదేశంలో ఇంతటి ఘోరం.. దిగ్భ్రాంతికరం. ఇది ఆమోదయోగ్యం కాదు..అని మమతా బెనర్జీ, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌లను ట్యాగ్ చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా హర్భజన్ సింగ్ ఓ లేఖను పోస్ట్ చేశారు.
వైద్యులు ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అభద్రతా వాతావరణంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని అంకితభావంతో పని చేయాలని మనం ఎలా అభ్యర్థించగలం?.. అని పేర్కొన్నారు. నిందితులను న్యాయస్థానం ముందు తీసుకురావడానికి బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని హర్బజన్ సింగ్ కోరారు.
Read Also: Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య