Temple Trustee: గుడిలో మహిళను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఆలయ ధర్మకర్త.. సంచలనం రేపుతోన్న వీడియో!
కర్ణాటకలో దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో ఓ మహిళలపై ఆలయం ధర్మకర్త కిరాతకంగా ప్రవర్తించాడు.
- By Anshu Published Date - 10:30 PM, Fri - 6 January 23

Temple Trustee: కర్ణాటకలో దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో ఓ మహిళలపై ఆలయం ధర్మకర్త కిరాతకంగా ప్రవర్తించాడు. గుడికి వచ్చిన మహిళను జుట్టు పట్టుకుని టెంపుల్ నుంచి బయటకు పంపించాడు. మహిళల పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత ఏడాది డిసెంబర్ 21న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా ఆ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళను ఆలయ ధర్మకర్త జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దేవాలయం బయటకు తీసుకెళ్లాడు. మహిళ నల్లగా, వింతగా ఉందంటూ ఆలయ ధర్మకర్త కించపరిచాడు. ఇనుప రాడ్ తో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ధర్మకర్తను ఆలయ పూజారి అడ్డుకున్నాడు.
బెంగళూరులోని లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. దర్శనం చేసుకునేందుకు వచ్చిన మహిళపై ఆల్య ధర్మకర్త మునికృష్ణప్ప దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడి సీసీ పుటేజీలో రికార్డు అయింది. గురువారం దీనిపై అమృతహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తనపై దాడి చేసిన అనంతరం ఎవరికైనా చెబితే తన భర్తను చంపేస్తానని బెదిరించాడని, అందుకే ఇప్పటివరకు చెప్పలేదని మహిళ చెబుతోంది.
ఇప్పుడు తమకు రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బయటకు చెబుతున్నట్లు మహిళ చెబుతోంది. అయితే ఆలయ ధర్మకర్త వాదన మాత్రం మరోలా ఉంది. వెంకటేశ్వరస్వామి తన భర్త అని, గర్భగుడిలో కూర్చుంటానని చెప్పిందని, పూజారులు అనుమతించకపోవడంతో వారిపై ఉమ్మేసినట్లు మునికృష్ణప్ప చెబుతున్నాడు. ఆమె అనుచిత ప్రవర్తనతో కోపంతో జట్టు పట్టుకుని బయటకు ఈడ్చెకెళ్లినట్లు చెబుతున్నాడు.దీంతో ఆలయ ధర్మకర్త కూడా మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.