Prajwal Revanna : మాజీ ప్రధాని మనవడి తలరాతను మార్చేసిన చీర..!
Prajwal Revanna : ఈ కేసులో ప్రజ్వల్ సులభంగా దొరికిపోవడానికి కారణం, అత్యాచారం జరిగిన రోజు పనిమనిషి ధరించిన చీర
- By Sudheer Published Date - 02:09 PM, Thu - 7 August 25

కర్ణాటక మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు రేప్ కేసులో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పోలీసులు పక్కాగా సాక్ష్యాలు సేకరించి, ప్రజ్వల్‌ను దోషిగా నిరూపించడంలో ఒక చీర కీలక పాత్ర పోషించిందట. రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ప్రజ్వల్, ఈ ఒక్క ఆధారంతోనే దొరికిపోయి, జీవిత ఖైదు శిక్షకు అర్హుడయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబ పరువును తీయడంతో పాటు, న్యాయ వ్యవస్థ ముందు ఎవరైనా సమానులేనని మరోసారి రుజువు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
47 ఏళ్ల పనిమనిషిపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం చేసినట్లు కోర్టు తేల్చింది. అయితే ఈ కేసులో ప్రజ్వల్ సులభంగా దొరికిపోవడానికి కారణం, అత్యాచారం జరిగిన రోజు పనిమనిషి ధరించిన చీర. అత్యాచారం తర్వాత ఆ చీరను ఆమెకు తిరిగి ఇవ్వకుండా, దానిని తన ఫామ్‌హౌస్‌లోని అటకపై పారేశాడు. ప్రజ్వల్ ఈ చీరను అంతగా పట్టించుకోలేదు, కానీ అదే చీర ఈ కేసులో నిర్ణయాత్మక సాక్ష్యంగా మారింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి, విచారణలో భాగంగా రేప్ జరిగినప్పుడు ధరించిన దుస్తుల గురించి చెప్పగా, ఆ చీరను తిరిగి ప్రజ్వల్ ఇవ్వలేదని వెల్లడించింది.
India Big Shock To Trump : ట్రంప్ కు ఈ రేంజ్ లో భారత్ షాక్ ఇస్తుందని ఎవ్వరు ఊహించుకోలేదు !!!
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఆ చీరను కనుగొని, దానిని ల్యాబ్‌కు పంపారు. ఆ చీరపై ప్రజ్వల్ వీర్యం ఆధారాలు లభించాయి. ఇతర ఆధారాలు లేకపోయినా, ఈ ఒక్క సాక్ష్యం ఆధారంగానే ప్రజ్వల్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించడంతో పాటు, బాధితురాలికి రూ. 11 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇంత పక్కాగా ఆధారాలు ఉన్నందున ప్రజ్వల్ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా తప్పించుకునే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా చట్టం ముందు సమానులేనని మరోసారి నిరూపించింది.