Cheapest Rover : గ్రహాలపై హల్‌చల్ చేయగల ‘రోవర్’.. లక్షన్నరే
Cheapest Rover : అంగారకుడు, చంద్రుడు వంటి వాటిపై తిరుగుతూ శాంపిల్స్‌ను సేకరించే రోవర్ల తయారీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.
- By Pasha Published Date - 02:19 PM, Sun - 10 December 23

Cheapest Rover : అంగారకుడు, చంద్రుడు వంటి వాటిపై తిరుగుతూ శాంపిల్స్‌ను సేకరించే రోవర్ల తయారీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రహాల పైనుంచి భూమికి కమ్యూనికేషన్‌ను నెరుపుతూనే, అక్కడి శాంపిల్స్‌ను సేకరించే రోవర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈనేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బీటెక్ విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో ఒక రోవర్‌ను రెడీ చేశారు. కేవలం లక్షన్నర రూపాయలతో ‘అగస్త్య’ అనే పేరు కలిగిన రోవర్‌ను తయారు చేశారు.
25 మంది విద్యార్థుల టీమ్..
సూరత్ ఎన్ఐటీలోని అన్ని బ్రాంచ్‌లకు చెందిన 25 మంది విద్యార్థుల టీమ్ కేవలం నాలుగు నెలల్లోనే ఆధునిక సాంకేతికతతో డెవలప్ చేయడం విశేషం. సాధారణంగా రోవర్ తయారీకి రూ.6 లక్షల దాకా ఖర్చవుతుంది. కానీ ఈ ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సూరత్ ఎన్ఐటీ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. ఇంటర్నేషనల్ రోవర్ ఛాలెంజ్ ఛాంపియన్షిప్ పోటీలలోనూ మొదటి రౌండ్‌ను అగస్త్య రోవర్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. వచ్చే ఏడాది కోయంబత్తూరులో జరిగే రెండో రౌండ్ పోటీల్లో దేశాల రోవర్లతో అగస్త్య తలపడనుంది.
We’re now on WhatsApp. Click to Join.
- అగస్త్య రోవర్‌లో మొబైల్ లేబొరేటరీ, మానిప్యులేటర్, జీపీఎస్ మాడ్యూల్, స్కాన్ మాడ్యూల్, కొలేషన్ సిస్టమ్, లైడార్ టెక్నాలజీ వంటి సాంకేతికలను వినియోగించారు.
- మిగతా రోవర్లలాగే అగస్త్య కూడా గ్రహ ఉపరితలంపై తిరగడం, నమూనాలను సేకరించడం, డేటాను పంపించటం వంటి పనులను చేస్తుంది.
- ఈ రోవర్ గ్రహ ఉపరితలం పైనుంచి మట్టిని సేకరించి నైట్రోజన్, కార్బన్డయాక్సైడ్, మీథేన్ మొదలైన మూలకాల ఉనికిని గుర్తించగలదు.
- ఈ రోవర్(Cheapest Rover) దాదాపు నాలుగు కిలోల బరువును ఎత్తగలదు.