Technical Problem : మరో విమానంలో సాంకేతిక సమస్య..ఈసారి ఎక్కడ..? ఏ విమానానికి అంటే..!!
Technical Problem : బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన థాయ్ ఎయిర్‌లైన్స్ 3జీ 329 విమానం(Thai Airways 3G329 flight)లో సాంకేతిక సమస్య తలెత్తింది
- By Sudheer Published Date - 11:13 AM, Fri - 20 June 25

ఈ మధ్య వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Problems) ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని క్షేమంగా బయటపడగా..మరికొన్ని క్రాష్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపగా..ఈ ఘటన తర్వాత కూడా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక సమస్య రావడం ప్రయాణికుల్లో ఆందోళన నింపింది.
Iran-Israel : పశ్చిమాసియాలో రణరంగం.. మొదటిసారి క్లస్టర్ బాంబులను వాడిన ఇరాన్
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన థాయ్ ఎయిర్‌లైన్స్ 3జీ 329 విమానం(Thai Airways 3G329 flight)లో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో విమానాన్ని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దింపి, ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. టెక్నికల్ సమస్యను పరిష్కరించే పనిలో అధికారులు ఉన్నారు. విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని, మధ్యాహ్నం 2 గంటల తర్వాతే హైదరాబాద్‌కు చేరుకుంటుందని అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
Shamshabad Airport : రూ.14వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్తరణ!
ఇటీవలి కాలంలో విమాన ప్రయాణాల్లో టెక్నికల్ సమస్యలు సాధారణంగా మారిపోయాయి. సాంకేతిక లోపాల కారణంగా విమానాలు నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు, లేదా ప్రయాణికులను ఇతర విమానాల్లో తరలించే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వారంలోనే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన నాలుగు విమానాలు టెక్నికల్ సమస్యలతో నిలిచిపోయాయి. ఇవి ప్రయాణికుల సమయాన్ని వృధా చేయడమే కాకుండా, వారి ప్రణాళికలను కూడా గందరగోళంగా మార్చేస్తున్నాయి.
నిన్న కూడా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న 80 మందికి పైగా ప్రయాణికులను ఇతర విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేశారు. ఈ తరహా ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతుండటంతో, ప్రయాణికుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, వాహన నిర్వహణ లోపాలు కారణమని విమర్శలు వస్తున్నాయి. విమాన సంస్థలు సాంకేతిక ప్రమాణాలపై మరింత బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.