MK Stalin : ప్రభుత్వ పథకాలు ఓట్ల కోసం కాదు.. ప్రజలకు సాయం చేసేందుకే: స్టాలిన్
ప్రభుత్వ పథకాలంటే ఓటు బ్యాంకును సంపాదించుకునే మార్గాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తిప్పికొట్టారు.
- Author : CS Rao
Date : 09-06-2022 - 5:12 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రభుత్వ పథకాలంటే ఓటు బ్యాంకును సంపాదించుకునే మార్గాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తిప్పికొట్టారు. తాము కేవలం తమిళనాడులోని వెనుకబడిన వర్గాల ప్రజలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో మార్పును సాధించేందుకే సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని ఆయన తేల్చి చెప్పారు. మళ్లీ అధికారంలోకి రావాలనే యావతో సంక్షేమ పథకాలను అమలు చేసే దురుద్దేశం తమకు లేనే లేదన్నారు. గురువారం తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను స్టాలిన్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో మార్పును చూడాలనే తాపత్రయం తమలో ఉందన్నారు. పుడుకొట్టాయి జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తయిన పలు మౌలిక సదుపాయాల కల్పన పనులను స్టాలిన్ ప్రారంభించారు.