Encourage Voters: ఓటు వేసినవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్‌పై 50శాతం డిస్కౌంట్..!
లోక్‌సభ 6వ దశ ఎన్నికల పోలింగ్ శనివారం ఢిల్లీలో జరగనుంది. గరిష్ట సంఖ్యలో ప్రజలు ఓటు వేయడానికి ప్రోత్సహించడానికి Swiggy Dine Out ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వచ్చింది.
- By Gopichand Published Date - 08:10 AM, Sat - 25 May 24

Encourage Voters: లోక్‌సభ 6వ దశ ఎన్నికల పోలింగ్ శనివారం ఢిల్లీలో జరగనుంది. గరిష్ట సంఖ్యలో ప్రజలు ఓటు వేయడానికి ప్రోత్సహించడానికి Swiggy Dine Out ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద ఓటు వేసిన తర్వాత ప్రజలు తమ వేలిపై ఓటు (Encourage Voters) వేసినట్లు సిరాను చూపడం ద్వారా ఢిల్లీలోని అనేక టాప్ రెస్టారెంట్‌లలో ఆహారంపై 50 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఇటీవల 5వ దశ ఓటింగ్ సందర్భంగా ముంబైలోని 100 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఇదే విధమైన ఆఫర్‌ను అమలు చేశాయి. అక్కడ ప్రజలు వారి వేలిపై సిరా చూపించి 20 శాతం తగ్గింపు పొందారు.
ఈ రెస్టారెంట్లలో ప్రయోజనాలను పొందుతారు
మే 25న ఢిల్లీ ప్రజలు ఓటు వేసిన తర్వాత వేలిపై సిరాను చూపించి.. మినిస్ట్రీ ఆఫ్ బీర్, దర్జీ బార్ & కిచెన్, చిడో, బ్రూక్రేట్: బ్రూవరీ స్కైబార్ & కిచెన్, వియత్నాం తదితర ప్రముఖ రెస్టారెంట్లలో భోజనం చేయవచ్చని స్విగ్గీ తెలిపింది. మీరు తిన్న బిల్లులపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును కూడా పొందవచ్చని పేర్కొంది. ఓటింగ్‌లో పౌరుల చురుకుదనాన్ని పెంచడానికి స్విగ్గీ ఈ చొరవ తీసుకుంది. Swiggy Dineout.. నగరంలోని రెస్టారెంట్లు కలిసి ప్రజల ఓటింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఢిల్లీలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాయి.
Also Read: Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే..
స్విగ్గీ డైనౌట్ అధినేత స్వప్నిల్ బాజ్‌పేయి మాట్లాడుతూ.. ఓటు వేయడం ఒక ప్రత్యేకతతో పాటు బాధ్యత కూడా. Swiggy Dineout పౌరులలో ఓటింగ్ శాతం పెంచడానికి నగరంలోని టాప్ రెస్టారెంట్‌లతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటు హక్కును వినియోగించుకున్న సంతృప్తితో మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం చేయడం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాలి. ఢిల్లీలో ఓటింగ్ గణాంకాలను పెంచడంలో మా ఈ చొరవ దోహదపడుతుందని మేము పూర్తి ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
We’re now on WhatsApp : Click to Join