4% Muslim quota: కర్ణాటక ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీం
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ని తొలగిస్తూ.. వాటిని ఓబీసీ కోటాలో చేరుస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది
- By Praveen Aluthuru Published Date - 01:35 PM, Tue - 25 April 23

4% Muslim quota: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ని తొలగిస్తూ.. వాటిని ఓబీసీ కోటాలో చేరుస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సుప్రీం ఆ కేసుపై విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజు ముస్లిం 4 శాతం రిజర్వేషన్ తొలగింపుపై విచారించి కర్ణాటక ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు కర్ణాటక గవర్నమెంట్ కు షాకిచ్చింది. ముస్లింలకు నాలుగు శాతం కోటాను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మే 9 వరకు అమలు చేయరాదని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. మే 9వ తేదీ వరకు ముస్లింలకు నాలుగు శాతం కోటాలో గతంలో ఏర్పాటు చేసిన విధానం కొనసాగుతుందని న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వొక్కలింగాలు, లింగాయత్‌లకు ఎలాంటి కోటా ప్రయోజనం కల్పించబోమని రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న ఇచ్చిన హామీని తదుపరి విచారణ తేదీ వరకు నమోదు చేసింది.
Read More: viveka : అవినాష్ అరెస్ట్ వేళ సునితారెడ్డిపై పోస్టర్లు.!