Arya Samaj Marriage : ఆ పెళ్లిళ్లు చెల్లవు: సుప్రీంకోర్టు
ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
- By Hashtag U Published Date - 04:32 PM, Fri - 3 June 22

ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్యసమాజ్‌లలో జరిగే పెళ్లిళ్లను చట్టబద్ధంగా గుర్తించమని, ఆ సర్టిఫికెట్లు పనికిరావని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు చేయడం ఆర్యసమాజ్ పనికాదని పేర్కొంది.ఓ కేసులో నిందితుడు బెయిల్ అప్లికేషన్‌తో పాటు ఆర్యసమాజ్ నుంచి తెచ్చిన తన వివాహ ధృవీకరణను కోర్టుకు సమర్పించాడు. వాటిని పరిశీలించిన న్యాయస్ధానం ఆర్యసమాజ్ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవని వ్యాఖ్యానించింది.