Mizoram Result : మిజోరం ఎన్నికల ఫలితం నేడే
Mizoram Result : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజే విడుదల అవుతాయి.
- By Pasha Published Date - 07:34 AM, Mon - 4 December 23

Mizoram Result : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజే విడుదల అవుతాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 13 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8.30 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ఆపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం నాలుగు వేల మంది సిబ్బంది పాల్గొంటారు. రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జొరాం పీపుల్స్ మూమెంట్ (జడ్‌పీఎం), కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి మిజోరంలో కూడా డిసెంబరు 3నే (ఆదివారమే) కౌంటింగ్‌ను షెడ్యూల్ చేశారు. అయితే మిజోరంలో మెజారిటీ జనాభా క్రైస్తవులు. వారికి ఆదివారం ప్రత్యేకమైన దినం. ఆ రోజు ప్రత్యేకమైన ప్రార్ధనలతో అక్కడి ప్రజలు గడుపుతుంటారు. అందుకే ఆదివారం రోజున ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని మిజోరాం ప్రజా సంఘాలు కేంద్ర ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ చేశాయి. దీంతో మరుసటి రోజు (డిసెంబరు 4)కు ఓట్ల లెక్కింపును(Mizoram Result) వాయిదా వేశారు.