Sitaram Yechury : సీతారాం ఏచూరి కన్నుమూత
Sitaram Yechury : కొన్నాళ్లుగా ఆయన శ్వాసకోస సమస్యతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమమం అయ్యి..గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
- Author : Sudheer
Date : 12-09-2024 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
Sitaram Yechury Died : సీపీఎం (CPM) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన శ్వాసకోస సమస్యతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమమం అయ్యి..గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12 జన్మించారు. 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యునిగా చేరారు.
1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఏచూరి మరణంతో కమ్మూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Read Also : US Navy Seals : చైనాకు షాక్.. తైవాన్ ఆర్మీకి అమెరికా నేవీ సీల్స్ ట్రైనింగ్