Maharashtra : గడియారం గుర్తు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్
Maharashtra : ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన 'గడియారం' గుర్తుకు బదులు కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 08:52 PM, Wed - 2 October 24

Sharad Pawar : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ న్యాయపోరాటం చేపట్టారు. ఎన్నికలో అజిత్ వర్గం ‘గడియారం’ గుర్తును వినియోగించకుండా నిరోధించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.
Read Also: Iran : ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా'(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్ పవార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్ పవార్ దాఖలుచేసిన పిటిషన్ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.