Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు
Jyoti Malhotra : "ఈ సరిహద్దులు ఎప్పటివరకు ఉంటాయో తెలియదు. కానీ హృదయాల మధ్య ఉన్న బాధలు మాత్రం ఒక్కరోజు మాయం అవుతాయి. మనమందరం ఒకే భూమికి చెందినవాళ్లం" అని జ్యోతి తన డైరీలో రాసిందని పోలీసులు వెల్లడించారు
- By Sudheer Published Date - 06:57 AM, Wed - 21 May 25

పాకిస్తాన్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు ఆమెను విచారిస్తుండగా, జ్యోతి వ్యక్తిగతంగా వాడే డైరీ (Jyoti Malhotra Dairy)ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ప్రతి ప్రయాణాన్ని, అనుభవాన్ని డైరీలో వివరంగా నమోదు చేసుకునే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ డైరీలో జ్యోతి తన పర్యటన అనుభవాలను ఇంగ్లీషు, హిందీ భాషల్లో పంచుకుంది. అయితే పాకిస్తాన్ నుంచి తిరిగిన తర్వాత మాత్రం ఆమె హిందీలో మాత్రమే రాసినట్లు పోలీసులు తెలిపారు. డైరీలో “పాకిస్తాన్‌లో 10 రోజుల పాటు ఉన్నాను. అక్కడి ఆతిథ్యం బాగుంది. మతపరమైన ప్రదేశాలు , దేవాలయాలు, గురుద్వారాలు అందరికీ చేరదగినవిగా ఉన్నాయి” అనే అంశాలు ఉన్నాయి. అంతేగాక దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలవాలని ఆమె తలంపులు కూడా వ్యక్తమయ్యాయి.
Rs 400 Crore Scam: విజయవాడలో రూ.400 కోట్ల చీటింగ్ ..‘యానిమేషన్ స్కాం’ వివరాలివీ
అంతేగాక “ఈ సరిహద్దులు ఎప్పటివరకు ఉంటాయో తెలియదు. కానీ హృదయాల మధ్య ఉన్న బాధలు మాత్రం ఒక్కరోజు మాయం అవుతాయి. మనమందరం ఒకే భూమికి చెందినవాళ్లం” అని జ్యోతి తన డైరీలో రాసిందని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత భావజాలాన్ని చూపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం జరిగిన అరెస్ట్ కేసులో ఈ డైరీ కీలక ఆధారంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీని ఆధారంగా ఆమెపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగనుంది.